ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సర్‌ ఆర్ధర్‌ కాటన్‌ ట్రోఫీ పోటీలకు విస్తృత ఏర్పాట్లు

ABN, Publish Date - Jan 10 , 2025 | 01:05 AM

సర్‌ ఆర్ధర్‌ కాటన్‌ ట్రోఫీ సంబరాలు ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చురు కుగా చేపడుతోంది.

ఆత్రేయపురం, జనవరి 9(ఆంధ్రజ్యోతి): సర్‌ ఆర్ధర్‌ కాటన్‌ ట్రోఫీ సంబరాలు ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చురు కుగా చేపడుతోంది. ఆత్రేయపురం లాకుల వద్ద ప్రధాన కాలువలో పడవ, ఈత పోటీలు నిర్వహించనున్నారు. సంక్రాంతి ముందుగా 11, 12, 13 తేదీల్లో నిర్వహించే ఈ పోటీలను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతోంది. ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పోటీల ఏర్పాటు నిర్వహణకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇప్పటికే కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌కుమార్‌, ఆర్డీవో శ్రీకర్‌ ఏర్పాట్లను పర్యవేక్షించి సూచనలు చేశారు. తహశీల్ధారు రాజేశ్వరరావు పర్యవేక్షణలో వీటి ఏర్పాట్లు చేపడుతున్నారు. వివిధ రాష్ర్టాల క్రీడాకారులు పోటీల్లో పాల్గొంటున్నారు. గురువారం ప్రధాన కాలువలో ట్రయిల్‌ రన్‌ జరిపారు. ట్రాఫిక్‌ సమస్య ఏర్పడకుండా లొల్ల లాకుల నుంచి ఉచ్చిలి వరకు ట్రాఫిక్‌ను మళ్లించి పోటీలను తిలకించే వారికి పార్కింగ్‌ సౌకర్యం ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే బండారు సత్యా నందరావు ఆదేశాల మేరకు ఉమ్మడి జిల్లాలోని మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు, అధికారులకు ఈ ట్రోిఫీకి రావాలని ఆహ్వానాలు పంపారు.

Updated Date - Jan 10 , 2025 | 01:05 AM