వెంకన్న క్షేత్రం.. కల్యాణ సంబరం
ABN, Publish Date - Apr 08 , 2025 | 12:31 AM
ఆత్రేయపురం, ఏప్రిల్ 7(ఆంధ్రజ్యోతి): కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వేంకటేశ్వరస్వామి దివ్యకల్యాణ మహోత్సవాలు దశమి సోమవారం నుంచి ఘనంగా ప్రారంభయయ్యాయి. వేకువజామునే మేల్కొపు, నిత్యబలిహరణ, బాలభోగ నివేదన, నిరాజన మంత్రపుష్పం అనంతరం భక్తులకు దర్శనాలు, సాయంత్రం విశ్వక్సేన ఆరా ధన, దీక్షాధారణ, వాస్తు పూజ, అగ్నిప్రతిష్టాపన, ధ్వజారోహణంతో కార్యక్రమాలను నిర్వహించారు. వైఖానస ఆగమ శాస్త్రప్రకారం ఖండవిల్లి రా

వాడపల్లి వెంకన్న దివ్యకల్యాణ మహోత్సవాలు ప్రారంభం
ధ్వజారోహణంతో అంకురార్పణ
నేడు తీర్థం, రథోత్సవం, కల్యాణం
ఆత్రేయపురం, ఏప్రిల్ 7(ఆంధ్రజ్యోతి): కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వేంకటేశ్వరస్వామి దివ్యకల్యాణ మహోత్సవాలు దశమి సోమవారం నుంచి ఘనంగా ప్రారంభయయ్యాయి. వేకువజామునే మేల్కొపు, నిత్యబలిహరణ, బాలభోగ నివేదన, నిరాజన మంత్రపుష్పం అనంతరం భక్తులకు దర్శనాలు, సాయంత్రం విశ్వక్సేన ఆరా ధన, దీక్షాధారణ, వాస్తు పూజ, అగ్నిప్రతిష్టాపన, ధ్వజారోహణంతో కార్యక్రమాలను నిర్వహించారు. వైఖానస ఆగమ శాస్త్రప్రకారం ఖండవిల్లి రాజేశ్వరవరప్రసాద్‌చార్యులు బ్రహ్మత్వంలో వేదపడింతులు ధ్వజపతాకం ఎగురవేసి కల్యాణోత్సవాలకు అంకురార్పణ చేశారు. ఏకాదశి మంగళవారం స్వామివారిని మేల్కొపి భక్తులకు దర్శనాలు అందిస్తారు. మధ్యాహ్నం ఎదుర్కొలు ఉత్సవం నిర్వహించి వేలాది మంది భక్తుల నడుమ రథోత్సవం నిర్వహించనున్నారు. రాత్రి శ్రీనివాస ప్రాంగణంలోని సర్వాంగ సుందరంగా అలంకరించిన వేదిక వద్ద జగత్ కల్యాణార్థం స్వామివారి దివ్యకల్యాణ మహోత్సవం నిర్వహించనున్నారు. సోమవారం సాయంత్రం స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యానందరావు స్వా మిని దర్శించుకున్నారు. కల్యాణోత్సవ ఏర్పా ట్లను పరిశీలించారు. ఆర్డీవో శ్రీకర్, డీఎస్పీ సుంకర మురళీమోహన్, ఉపకమిషనరు నల్లం సూర్యచక్రధరరావులు కలిసి కల్యాణ వేదిక, పుష్కరఘాట్లు, రథోత్సవం నిర్వ హించే మాడవీధులు, భక్తుల సౌకర్యాలపై పరిశీలించి చర్చించారు. వివిధ డిపోల నుం చి ఆర్టీసీ బస్సులు వస్తున్న దృష్ట్యా పార్కి ంగ్ నిర్వహించే ప్రదేశాలను పరిశీలించారు.
విద్యుత్ దీపాలంకరణ, పుష్పాలంకరణలు
శ్రీనివాస ప్రాంగణంలోని కల్యాణ వేదికను వివిధ రకాల పుష్పాలతో అలంకరించే పనిలో నిపుణులు నిమగ్నమయ్యా రు. 10వేల మంది వీఐపీలు, భక్తులు, ప్రముఖులు, స్వామివారి కల్యాణం తిలకించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. రావులపాలెం నుంచి బొబ్బర్లంక, లొల్ల నుంచి వాడపల్లి వరకూ స్వాగత ద్వారాలు, ఎల్‌ఈడీ విద్యుత్ లైట్లతో అలంకరించారు. ఆలయ ప్రాంగణంతో పాటు మాడవీధులు దేవతామూర్తులతో పాటు విద్యుత్ దీపాలంకరణ భక్తులను ఆకట్టుకుంది. ఫలపుష్పాలతో స్వామివారి ఆలయాన్ని అలంకరించారు.
Updated Date - Apr 08 , 2025 | 12:31 AM