ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

వెంకన్న ఆదాయం రూ.2.35లక్షలు

ABN, Publish Date - Apr 03 , 2025 | 01:15 AM

వాడపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయానికి బుధవారం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో రద్దీనెలకొంది.

ఆత్రేయపురం, ఏప్రిల్‌ 2(ఆంధ్రజ్యోతి): వాడపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయానికి బుధవారం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో రద్దీనెలకొంది. నోము ఆచరించిన భక్తులు అష్టోత్తర పూజలు, నిత్య కల్యాణాలు చేశారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం భక్తులు అన్నప్రసాదంలో పాల్గొన్నారు. వివిధ సేవల ద్వారా ఒక్కరోజు ఆదాయం రూ.2,35,389 వచ్చినట్టు ఉపకమిషనరు, ఈవో నల్లం సూర్యచక్రధరరావు తెలిపారు.

పెందుర్తి ఎమ్మెల్యే పూజలు : విశాఖ జిల్లా పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు కుటుంబ సభ్యులతో స్వామివారిని దర్శించుకున్నారు. తొలుత స్వామివారికి అష్టోత్తర పూజలు జరిపారు. అనంతరం వేద పండితుల ఆశీర్వచనం తీసుకుని స్వామివారి తీర్ధప్రసాదాలు స్వీకరించారు.

Updated Date - Apr 03 , 2025 | 01:15 AM