ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

హోరాహోరీగా బండలాగుడు పోటీలు

ABN, Publish Date - Apr 16 , 2025 | 12:58 AM

తర్తూరు జాతర సందర్భంగా నిర్వహించిన సీనియర్‌ విభాగం రాష్ట్రస్థాయి పెద్దబండలాగుడు పోటీలు హోరాహోరీగా జరిగాయి.

బండలాగుడు పోటీలను ప్రారంభిస్తున్న టీడీపీ నాయకుడు మోహనరెడ్డి

జూపాడుబంగ్లా, ఏప్రిల్‌ 15 (ఆంధ్రజ్యోతి): తర్తూరు జాతర సందర్భంగా నిర్వహించిన సీనియర్‌ విభాగం రాష్ట్రస్థాయి పెద్దబండలాగుడు పోటీలు హోరాహోరీగా జరిగాయి. మంగళవారం పోటీలను సీనియర్‌ టీడీపీ నాయకులు మాండ్రసురేంద్రనాథరెడ్డి, మోహనరెడ్డి, గిరీశ్వరరెడ్డి కలిసి ప్రారంభించారు. నంద్యాల జిల్లా గుంపరమానుదిన్నె గ్రామానికి చెందిన రాంభూపాల్‌రెడ్డికి చెందిన వృషభాలు నిర్ణయించిన వ్యవధిలో 2700 అడుగుల దూరాన్ని లాగి ప్రథమస్థానంలో నిలిచి రూ.70వేలు కైవసం చేసుకున్నారు. నంద్యాల జిల్లా గుంపరమానుదిన్నె గ్రామానికి చెందినరాంభూపాల్‌రెడ్డి, అలగనూరు గ్రామానికిచెందిన రొలిమేడం చేరొక వృషభం పోటీల్లో పాల్గొని ద్వితీయస్థానంలో నిలిచి రూ. 50వేలు, నంద్యాలజిల్లా హుసేనాపురం గ్రామానికి చెందిన రామసుబ్బారెడ్డి వృషభాలు తృతీయస్థానంలో నిలిచి రూ. 30వేలు గెలుచుకున్నారు. నంద్యాల జిల్లా పెసరవాయి గ్రామానికి చెందిన కలాంబాషా వృషభాలు నాలుగో స్థానంలో నిలిచి రూ.20వేలు, నంద్యాల జిల్లా సీసంగతుల గ్రామానికి చెందిన మదనమోహనరెడ్డికి చెందిన వృషబాలు ఐదో స్థానంలో నిలిచి రూ.10వేలు కైవసం చేసుకున్నారు. గెలుపొందిన వృషభరాజుల యజమానులకు కమిటీ సభ్యులు నగదును అందజేశారు. కార్యక్రమంలో యాదవకార్పోరేషన డైరెక్టర్‌ వెంకటేశ్వర్లుయాదవ్‌, రమణారెడ్డి, శ్రీనివాసులు, దొరబాబురెడ్డి,్డ రవికాంత ఆలయ చైర్మన నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 16 , 2025 | 12:58 AM