AP High Court: హైకోర్టులో ఐదుగురు స్టాండింగ్ కౌన్సిళ్ల
ABN, Publish Date - Apr 05 , 2025 | 02:10 AM
ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వివిధ ప్రభుత్వ సంస్థలకు స్టాండింగ్ కౌన్సిళ్లుగా ఐదుగురు న్యాయవాదులను ప్రభుత్వం నియమించింది. న్యాయశాఖ కార్యదర్శి ప్రతిభాదేవి దీనికి సంబంధించిన ఉత్తర్వులు జారీచేశారు.

నియామకం: ఉత్తర్వులు జారీ చేసిన న్యాయశాఖ
అమరావతి, ఏప్రిల్ 4(ఆంధ్రజ్యోతి): హైకోర్టులో వివిధ ప్రభుత్వ సంస్థల తరఫున వాదనలు వినిపించేందుకు ఐదుగురు న్యాయవాదులను స్టాండింగ్ కౌన్సిళ్లుగా నియమిస్తూ న్యాయశాఖ ఉత్తర్వులు జారీచేసింది. న్యాయవాదులు.. ఏవీ కొండయ్య- ఏపీ విత్తనాభివృద్ధి కార్పొరేషన్, కేకే దుర్గా ప్రసాద్-తిరుపతి అర్బన్ డెవల్‌పమెంట్ అఽథారిటీ, జి.రత్నకుమార్-ఏపీ ఎస్సీ కోపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్, నందం జీవన్‌కుమార్-ఏపీ మినరల్ డెవల్‌పమెంట్ కార్పొరేషన్, మహ్మద్ సలీం ఏపీ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ స్టాండింగ్ కౌన్సిల్‌గా నియమితులయ్యారు. వీరి నియామకానికి సంబంధించి న్యాయశాఖ కార్యదర్శి జి.ప్రతిభాదేవి శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చారు.
ఇవి కూడా చదవండి
Borugadda Anil: రాజమండ్రి నుంచి అనంతపురానికి బోరుగడ్డ.. ఎందుకంటే
Kasireddy shock AP High Court: లిక్కర్ స్కాంలో కసిరెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ
Read Latest AP News And Telugu News
Updated Date - Apr 05 , 2025 | 02:10 AM