హెడ్‌కానిస్టేబుల్‌కు అంత్యక్రియలు
ABN, Publish Date - Feb 10 , 2025 | 12:11 AM
అనంతపురం టూటౌన పోలీసుస్టేషనలో హెడ్‌కానిస్టేబుల్ నారాయణ నాయక్ (57) రోడ్డు ప్రమాదంలో గాయపడి.. హైదరాబాద్ ఆస్పత్రిలో చికిత్స పొందు తూ శనివారం మరణించాడు.

పుట్టపర్తిరూరల్, ఫిబ్రవరి 9(ఆంధ్రజ్యోతి): అనంతపురం టూటౌన పోలీసుస్టేషనలో హెడ్‌కానిస్టేబుల్ నారాయణ నాయక్ (57) రోడ్డు ప్రమాదంలో గాయపడి.. హైదరాబాద్ ఆస్పత్రిలో చికిత్స పొందు తూ శనివారం మరణించాడు. ఆదివారం అతని అంత్యక్రియలను స్వగ్రామమైన శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తి మండలం పెడపల్లి గ్రామంలో ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించారు. ఆయన 1993లో పోలీస్ కానిస్టేబుల్‌గా విధుల్లో చేరారు. హెడ్‌కానిస్టేబుల్‌గా ఉద్యోగోన్నతి పొందిన ఆయన అనంతపురం టూటౌన పోలీసు స్టేషనలో విధులు నిర్వహించేవారు. ఆయనకు భార్య శాంతాబాయి, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఆయన అంత్యక్రియలలో అనంతపురం టూటౌన సీఐ శ్రీకాంత, పుట్టపర్తిరూరల్ ఎస్‌ఐ లింగన్న, పోలీసు అధికారుల సంఘం రాష్ట్ర కమిటీసభ్యులు సురేశకుమార్, జిల్లా పోలీసు అధికారుల సంఘం అడహక్ సభ్యుడు సాకేత్రి లోక్‌నాథ్, బంధువులు పాల్గొన్నారు.
Updated Date - Feb 10 , 2025 | 12:11 AM