Inflation : ధరల నియంత్రణలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం
ABN, Publish Date - Jan 12 , 2025 | 06:39 AM
పెరుగుతున్న ధరలను అదుపు చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు విమర్శించారు. సీపీఎం 27వ రాష్ట్ర మహాసభలకు సంబంధించిన పోస్టర్లను శనివారం నెల్లూరులోని సీపీఎం జిల్లా
తిరుపతిలో తొక్కిసలాటకు ప్రభుత్వానిదే బాధ్యత
ఫిబ్రవరిలో నెల్లూరులో సీపీఎం రాష్ట్ర మహాసభలు: శ్రీనివాసరావు
నెల్లూరు(వైద్యం), జనవరి 11(ఆంధ్రజ్యోతి): పెరుగుతున్న ధరలను అదుపు చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు విమర్శించారు. సీపీఎం 27వ రాష్ట్ర మహాసభలకు సంబంధించిన పోస్టర్లను శనివారం నెల్లూరులోని సీపీఎం జిల్లా కార్యాలయంలో ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విలేకరులతో శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రభుత్వం విద్యుత్ ట్రూఅప్ చార్జీలను రద్దు చేయాలని, స్మార్ట్ మీటర్ల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్నికల హామీలు నెరవేర్చటంలో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. తిరుమలలో తొక్కిసలాట, మరణాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని.. కింది స్ధాయి అధికారులను బలి చేయడం సరికాదని చెప్పారు. ఫిబ్రవరి 1, 2, 3వ తేదీల్లో నెల్లూరులో సీపీఎం రాష్ట్ర మహాసభలు జరుగుతాయని, జయప్రదం చేయాలని కోరారు.
Updated Date - Jan 12 , 2025 | 06:40 AM