Share News

Intermediate Results: ఇంటర్‌లో ‘ప్రభుత్వ’ టాపర్లకు నేడు సన్మానం

ABN , Publish Date - Apr 15 , 2025 | 04:45 AM

ఇంటర్మీడియట్‌ ఫలితాల్లో రాష్ట్రస్థాయి టాపర్లుగా నిలిచిన ప్రభుత్వ కాలేజీ విద్యార్థులను మంత్రి నారా లోకేశ్‌ సన్మానించనున్నారు. 52 మందికి ల్యాప్‌ట్యాపులు, మెడల్స్‌, సన్మాన పత్రాలు అందజేస్తారు.

Intermediate Results: ఇంటర్‌లో ‘ప్రభుత్వ’ టాపర్లకు నేడు సన్మానం

నేడు సన్మానించనున్న మంత్రి లోకేశ్‌

52 మందికి లోకేశ్‌ చేతుల మీదుగా మెడల్స్‌, ల్యాప్‌ట్యా్‌పలు

అమరావతి, ఏప్రిల్‌ 14 (ఆంధ్రజ్యోతి): ఇంటర్మీడియట్‌ ఫలితాల్లో ప్రభుత్వ కాలేజీల్లో రాష్ట్రస్థాయి టాపర్లుగా నిలిచిన విద్యార్థులను ప్రభుత్వం సన్మానించనుంది. మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేశ్‌ మంగళవారం ఉండవల్లిలోని తన నివాసంలో వారికి ల్యాప్‌ట్యా్‌పలు, మెడల్స్‌, సన్మాన పత్రాలు అందజేయనున్నారు. ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో 29 మంది, కేజీబీవీల్లో ఏడుగురు, ఏపీఆర్‌జేసీల్లో ఏడుగురు, మోడల్‌ స్కూల్స్‌లో ఆరుగురు, హైస్కూల్‌ ప్లస్‌లలో ముగ్గురు విద్యార్థులు చొప్పున మొత్తం 52 మందికి సన్మానం చేయనున్నారు. వీరిలో ఆరుగురు విభిన్న ప్రతిభావంతులున్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులతో మంత్రి లోకేశ్‌ మాట్లాడనున్నారు. ఈ ఏడాది ఇంటర్మీడియట్‌లో ఉత్తీర్ణత భారీగా పెరిగిన విషయం తెలిసిందే. ప్రభుత్వ కాలేజీల్లోనూ ఉత్తమ ఫలితాలు వచ్చాయి.


ఈ వార్తలు కూడా చదవండి:

Visakhapatnam: మరో 24 గంటల్లో డెలివరీ కానున్న భార్య.. భర్త ఎంత దారుణానికి ఒడికట్టాడో..

PM Narendra Modi: కంచ గచ్చిబౌలి భూములు.. కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగిన ప్రధాని మోదీ..

Updated Date - Apr 15 , 2025 | 04:45 AM