Wakf Board: మస్తాన్ సాయి న్యూడ్ వీడియోల ఎఫెక్ట్....
ABN , Publish Date - Apr 15 , 2025 | 01:24 PM
రెండు తెలుగు రాష్ట్రాల్లో లావణ్య, మస్తాన్ సాయిల కేసు వ్యవహారం సంచలనంగా మారింది. మస్తాన్ సాయి కుటుంబాన్ని గుంటూరు మస్తాన్ దర్గా ధర్మకర్తలుగా తొలగించాలని గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు లావణ్య న్యాయవాది లేఖ రాయడంతో కలకలం రేగింది. ఇప్పుడు ఈ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.

గుంటూరు జిల్లా: మస్తాన్ సాయి (Mastan Sai) న్యూడ్ వీడియోల ఎఫెక్ట్ (Nude video controversy)... గుంటూరు (Guntur)లో మస్తాన్ దర్గా (Mastan Dargah) స్వాధీనానికి జిల్లా వక్ఫ్ బోర్డు (Wakf Board) అధికారుల నిర్ణయించారు. అయితే మస్తానయ్య దర్గాకు ధర్మకర్తగా మస్తాన్ సాయి తండ్రి రామ్మోహన్ రావు (Ramamohan Rao) ఉన్నారు. ఈ నెల 11న మస్తాన్ దర్గాకు వక్ఫ్ అధికారులు వచ్చారు. మస్తాన్ దర్గాను స్వాధీనం చేసుకుంటామని వక్ఫ్ అధికారులు ప్రకటించారు. ఈ మేరకు రావి రామ్మోహన్ రావుకు అధికారులు సమాచారమిచ్చారు. అయితే ఈ నెల 14వ తేదీ వరకు సమయం కావాలని రామ్మోహన్ రావు అధికారులను కోరారు. దానికి అంగీకరించిన అధికారులు 14న (సోమవారం) దర్గాకు వచ్చారు. అప్పుడు కూడా రామ్మోహన్ రావు అందుబాటులో లేరు. దీంతో వక్ఫ్ అధికారులు 15న (మంగళవారం) స్వాధీనం చేసుకుంటామని చెప్పి వెళ్లపోయారు. కాగా దర్గా వక్ఫ్ పరిధిలోకి రాదని రామ్మోహన్ రావు కుటుంబ సభ్యులు అంటున్నారు.
Also Read..: వివేకా హత్య కేసు.. సుప్రీం కీలక విచారణ..
కాగా రెండు తెలుగు రాష్ట్రాల్లో లావణ్య, మస్తాన్ సాయిల కేసు వ్యవహారం సంచలనంగా మారింది. మస్తాన్ సాయి కుటుంబాన్ని గుంటూరు మస్తాన్ దర్గా ధర్మకర్తలుగా తొలగించాలని గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు లావణ్య న్యాయవాది లేఖ రాయడంతో కలకలం రేగింది. ఇప్పుడు ఈ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. దర్గా ధర్మకర్త కొడుకు అయిన మస్తాన్ సాయి నేరాలతో దర్గా పవిత్ర, భద్రతకు, భంగం వాటిల్లుతోందని అటువంటి వ్యక్తి తండ్రిని ధర్మకర్తగా ఎలా కొనసాగిస్తారని లేఖలో న్యాయవాది ప్రస్తావించారు.
మస్తాన్ సాయిపై ఇప్పటికే మహిళల నగ్న చిత్రాలు, డ్రగ్స్ కేసులు, అత్యాచారం, ఇలా సుమారు ఐదు క్రిమినల్ కేసులు నమోదయ్యాయని లాయర్ గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. దీనివల్ల భక్తుల భద్రత, దర్గా ప్రతిష్టతకు భంగం వాటిల్లుతుందని లేఖలో న్యాయవాది నాగూరు బాబు తెలిపారు. మస్తాన్ దర్గా ధర్మకర్త రావి రామ్మోహన్ రావు కుటుంబ ఆధిపత్యాన్ని తొలగించి, ప్రభుత్వం లేదా వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో దర్గాను నిర్వహించాలని లేఖలో వివరించారు. మస్తాన్ సాయిపై ఇప్పటివరకు ఉన్న అన్ని కేసుల వివరాలు లేఖలో లావణ్య న్యాయవాది నాగూరు బాబు ప్రస్తావించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఖైదీతో స్నేహితుల రీల్స్.. వీడియో వైరల్..
పాము కాటుకు గురైనప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
For More AP News and Telugu News