Nara Lokesh: విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
ABN , Publish Date - Apr 11 , 2025 | 11:45 AM
Minister Nara Lokesh: విద్యారంగంలో విప్లవాత్మక మార్పులకు ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. విద్య వ్యవస్థ బలోపేతానికి కూటమి ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తోందని అన్నారు. ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను నెరవేరుస్తున్నామని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు.

అమరావతి: లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ (LEAP) పేరిట నూతన విద్యా విధానానికి శ్రీకారం చుడుతున్నామని విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. అత్యున్నత ప్రమాణాలతో తొలి ప్రభుత్వ లీప్ పాఠశాలను మంగళగిరిలో ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు. ఎన్డీఏ కూటమి ప్రజలకు ఇచ్చిన ప్రతీ హామీని ఓ క్రమపద్ధతిలో నెరవేరుస్తోందని అన్నారు. ఇచ్చిన ప్రతీ హామీ నిలబెట్టుకుంటామని మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు.
మంగళగిరికి మంజూరైన ఆంధ్రప్రదేశ్‌లో తొలి వందపడకల ప్రభుత్వ ఆస్పత్రికి 13వ తేదీన శంకుస్థాపన చేస్తున్నామని మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. ప్రతిపక్షంలో ఉండగానే మంగళగిరి కోసం సొంత ఖర్చులతో 26 సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తే... అధికారంలో ఉండగా ఇంకెంత చేయగలనో ఆలోచించాలని అన్నారు. మంగళగిరిలో పోటీ చేయాలని 2019లో తీసుకున్న నిర్ణయం తన జీవితాన్నే మార్చేసిందని చెప్పారు. మంగళగిరిలో నాల్గో రోజు ‘మన ఇల్లు-మన లోకేష్’ కార్యక్రమం చేపట్టారు. పేదలకు మంత్రి నారా లోకేష్ శాశ్వత ఇంటి పట్టాలు అందజేస్తున్నారు. రత్నాల చెరువుకు చెందిన 600 మందికి, తాడేపల్లిలోని మహానాడు ప్రాంతానికి చెందిన 430 మంది పేదలకు శాశ్వత పట్టాలు పంపిణీ చేశారు. మొత్తం 1030 పేద కుటుంబాలకు శాశ్వత ఇంటి పట్టాలను మంత్రి నారా లోకేష్ పంపిణీ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి
CM Chandrababu: బిజీబిజీగా సీఎం చంద్రబాబు షెడ్యూల్.. ఏలూరు, కడప జిల్లాల్లో పర్యటన
ఫోటోషూట్లలోనే ఇదో కొత్త తరహా..
Madhav Police Clash: పోలీసులపై గోరంట్ల మాధవ్ దౌర్జన్యం
Purandeswari: పోలీసులకు జగన్ క్షమాపణ చెప్పాలి
Jagan : చంద్రబాబూ చర్యకు ప్రతిచర్య తప్పదు
Read Latest AP News And Telugu News