Share News

Minister Lokesh Comments: ఓడిన చోటే గెలిచి చూపించా

ABN , Publish Date - Apr 11 , 2025 | 04:44 PM

Minister Lokesh Comments: మంగళగిరిలో గెలవలేని వాడివి ఇంకేం మాట్లాడతావ్ అని ఎగతాళి చేశారని.. కొడుకుని కూడా గెలిపించుకోలేకపోయాడని చంద్రబాబును అవమానించారని మంత్రి లోకేష్ అన్నారు. ఓడిన చోట నుంచే అన్ని వర్గాల ప్రజల కోసం కష్టపడ్డానని తెలిపారు.

Minister Lokesh Comments: ఓడిన చోటే గెలిచి చూపించా
Minister Lokesh Comments

అమరావతి, ఏప్రిల్ 11: అవినీతిరహిత పాలనను చిత్తశుద్ధితో అందించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh) అన్నారు. మంగళగిరిలో నాలుగవ రోజు ‘మన ఇల్లు-మన లోకేష్’ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా పేదలకు మంత్రి లోకేష్ శాశ్వత ఇంటి పట్టాలు అందజేశారు. భోజన విరామం అనంతరం తాడేపల్లిలోని మహానాడు ప్రాంతానికి చెందిన 430 మంది పేదలకు శాశ్వత పట్టాలు పంపిణీ చేశారు. దీంతో ఈరోజు మొత్తం 1030 పేద కుటుంబాలకు శాశ్వత ఇంటి పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. బాధ, ఆవేదనతో పెరిగిన కసి నుంచే మంగళగిరి అభివృద్ధికి శ్రీకారం చుట్టామన్నారు.


మంగళగిరిలో గెలవలేని వాడివి ఇంకేం మాట్లాడతావ్ అని ఎగతాళి చేశారని.. కొడుకుని కూడా గెలిపించుకోలేకపోయాడని చంద్రబాబును అవమానించారని అన్నారు. ఓడిన చోట నుంచే అన్ని వర్గాల ప్రజల కోసం కష్టపడ్డానని తెలిపారు. 91వేల మెజారిటీతో గెలిపించిన ప్రజలు తనపై ఇంకా బాధ్యత పెంచారన్నారు. ‘నా గౌరవం, పరువు కాపాడిన మంగళగిరి ప్రజల్ని గుండెల్లో పెట్టుకుని ఏ లోటు లేకుండా చూసుకుంటా’ అని స్పష్టం చేశారు. వెయ్యి కోట్ల రూపాయల ఆస్తిని మంగళగిరి ప్రజలకు ఆస్తిగా పంచుతున్నామన్నారు. స్వచ్ఛతతో సహా అన్ని రంగాల్లో మంగళగిరి నియోజకవర్గాన్ని నెంబర్ 1 స్థానంలో నిలబెట్టేందుకు కలిసి కట్టుగా పని చేద్దామని మంత్రి లోకేష్ పిలుపునిచ్చారు.

Woman Suicide Attempt: సహజీవనం చేసి పట్టించుకోలేదంటూ ఓ మహిళ దారుణం


కాగా.. ఈరోజు (శుక్రవారం) ఉదయం రత్నాలచెరువుకు చెందిన 600 మంది పేదలకు శాశ్వత పట్టాలు పంపిణీ చేశారు మంత్రి లోకేష్. ఆపై మాట్లాడుతూ.. లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ (LEAP) పేరిట నూతన విద్యా విధానానికి శ్రీకారం చుడుతున్నామన్నారు. అత్యున్నత ప్రమాణాలతో తొలి ప్రభుత్వ లీప్ పాఠశాలను మంగళగిరిలో ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఎన్డీఏ కూటమి ప్రజలకు ఇచ్చిన ప్రతీ హామీని ఓ క్రమపద్ధతిలో నెరవేరుస్తోందన్నారు. ఇచ్చిన ప్రతీ హామీ నిలబెట్టుకుంటూ మీ లోకేష్ మీ ముందు నిలబడుతున్నారన్నారు. మంగళగిరి మంజూరైన ఆంధ్రప్రదేశ్‌‌లో తొలి 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రికి 13న శంకుస్థాపన చేస్తున్నట్లు తెలిపారు. ప్రతిపక్షంలో ఉండగానే మంగళగిరి కోసం సొంత ఖర్చులతో 26 సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తే.. అధికారంలో ఉండగా ఇంకెంత చేయగలనో ఆలోచించాలన్నారు. మంగళగిరిలో పోటీ చేయాలని 2019లో తీసుకున్న నిర్ణయం జీవితాన్నే మార్చేసిందని మంత్రి లోకేష్ పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి

Nellore Quartz Scam: బయటకు రానున్న నిజాలు.. వారి గుండెల్లో గుబులే

BRS Warangal Meeting: వరంగల్‌ బీఆర్‌ఎస్ సభపై హైకోర్టు ఏం తేల్చిందంటే

Read Latest AP News And Telugu News

Updated Date - Apr 11 , 2025 | 04:44 PM