Share News

Ambati Rambabu: అంబటి ఫిర్యాదుపై 4 కేసుల నమోదు

ABN , Publish Date - Apr 03 , 2025 | 04:55 AM

వైసీపీ నేత అంబటి రాంబాబు ఫిర్యాదులపై ఇప్పటికే నాలుగు కేసులు నమోదు కాగా, మరో కేసు ఎందుకు నమోదు చేయలేదో వివరిస్తామని పోలీసులు హైకోర్టుకు తెలిపారు. హైకోర్టు విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.

Ambati Rambabu: అంబటి ఫిర్యాదుపై 4 కేసుల నమోదు

మరో కేసు నమోదు చేయకపోవడానికి కారణాలున్నాయి

పూర్తి వివరాలతో కౌంటర్‌ వేస్తాం: హైకోర్టులో ఏజీపీ

అమరావతి, ఏప్రిల్‌ 2(ఆంధ్రజ్యోతి): వైసీపీ నేత అంబటి రాంబాబు ఇచ్చిన ఐదు ఫిర్యాదులకు సంబంధించి పోలీసులు ఇప్పటికే నాలుగు కేసులు నమోదు చేశారని, మరో కేసు నమోదు చేయకపోవడానికి కారణాలు ఉన్నాయని, వాటిని వివరిస్తూ కౌంటర్‌ వేస్తామని పోలీసుల తరఫున ఏజీపీ బుధవారం హైకోర్టుకు నివేదించారు. అందుకు అంగీకరించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ టి.మల్లికార్జునరావు విచారణను రెండు వారాలకు వాయిదా వేశారు. తమ పార్టీ అధినేత జగన్మోహన్‌రెడ్డితో పాటు తనను, తన కుటుంబ సభ్యుల ప్రతిష్ఠను దిగజార్చేలా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నవారిపై చర్యలు తీసుకోవాలని తానిచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేయకపోవడాన్ని సవాల్‌ చేస్తూ వైసీపీ నేత అంబటి రాంబాబు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యం బుధవారం విచారణకు రాగా పార్టీ ఇన్‌ పర్సన్‌ రాంబాబు నేరుగా వాదనలు వినిపించారు. తానిచ్చిన ఫిర్యాదుల ఆధారంగా పోలీసులు నాలుగు కేసులు నమోదు చేశారని, మరొక ఫిర్యాదులో కూడా బాధ్యులపై కేసు నమోదు చేసేలా పోలీసులను ఆదేశించాలని కోరారు.


ఇవి కూడా చదవండి:

FD Comparison: ఎస్బీఐ vs యాక్సిస్ బ్యాంక్.. వీటిలో ఏ FD బెస్ట్, దేనిలో ఎక్కువ వస్తుంది..

Samsung: శాంసంగ్ ఏసీల్లో సరికొత్త టెక్నాలజీ..స్మార్ట్ థింగ్స్ కనెక్షన్ సహా అనేక సౌకర్యాలు..

Updated Date - Apr 03 , 2025 | 04:55 AM