ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

NIA: దేవేంద్ర, చుక్కా శిల్పలకు బెయిల్‌ ఇవ్వలేం

ABN, Publish Date - Mar 15 , 2025 | 04:56 AM

నేర తీవ్రత దృష్ట్యా వీరిద్దరికీ బెయిల్‌ ఇవ్వలేమని తేల్చిచెప్పింది. విశాఖ కోర్టు ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ వారు వేసిన అప్పీళ్లను కొట్టివేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ కె.సురేశ్‌రెడ్డి, జస్టిస్‌ జస్టిస్‌ టి.చంద్ర ధనశేఖర్‌తో కూడిన ధర్మాసనం ఇటీవల తీర్పు ఇచ్చింది.

ఎన్‌ఐఏ ఆరోపణలకు ఆధారాలున్నాయ్‌: హైకోర్టు

ఆ ఇద్దరికీ మావోయిస్టు పార్టీతో సంబంధం లేదు

సీనియర్‌ న్యాయవాది సత్యప్రసాద్‌ వాదనలు

దేవేంద్ర, శిల్ప అప్పీళ్లను కొట్టివేసిన ధర్మాసనం

అమరావతి, మార్చి 14 (ఆంధ్రజ్యోతి): జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) నమోదు చేసిన కేసులో చైతన్య మహిళా సంఘానికి చెందిన డొంగరి దేవేంద్ర, చుక్కా శిల్పలకు బెయిల్‌ నిరాకరిస్తూ విశాఖపట్నం మూడో అదనపు జిల్లా కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకునేందుకు హైకోర్టు నిరాకరించింది. నేర తీవ్రత దృష్ట్యా వీరిద్దరికీ బెయిల్‌ ఇవ్వలేమని తేల్చిచెప్పింది. విశాఖ కోర్టు ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ వారు వేసిన అప్పీళ్లను కొట్టివేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ కె.సురేశ్‌రెడ్డి, జస్టిస్‌ జస్టిస్‌ టి.చంద్ర ధనశేఖర్‌తో కూడిన ధర్మాసనం ఇటీవల తీర్పు ఇచ్చింది. చైతన్య మహిళా సంఘానికి చెందిన డొంగరి దేవేంద్ర, చుక్కా శిల్ప తన కుమార్తె రాధకు మావోయిస్టు భావజాలాన్ని నూరిపోసి బలవంతంగా మావోయిస్టు పార్టీలో చేర్పించారని తల్లి పల్లెపాటి పోచమ్మ 2021 డిసెంబరులో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా ఉమ్మడి విశాఖ జిల్లా పెద్దబయలు పోలీసులు వారిద్దరిపై ఐపీసీ, ఉపా చట్టం కింద 2022 జనవరిలో కేసు నమోదు చేశారు. నేర తీవ్రత దృష్ట్యా ఈ కేసు దర్యాప్తును స్వీకరించిన ఎన్‌ఐఏ విచారణ పూర్తి చేసి సంబంధిత కోర్టులో చార్జిషీటుదాఖలు చేసింది. దేవేంద్ర, శిల్ప బెయిల్‌ కోసం పిటిషన్లు వేయగా.. విశాఖపట్నం మూడో అదనపు జిల్లా కోర్టు తిరస్కరించింది. ఈ ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ వారు హైకోర్టులో అప్పీల్‌ వేశారు. వారి తరఫున సీనియర్‌ న్యాయవాది ఎ.సత్యప్రసాద్‌ వాదనలు వినిపించారు. ‘తన కుమార్తెను బలవంతంగా తీసుకెళ్లి 2017లో మావోయిస్టు పార్టీలో చేర్పించారని రాధ తల్లి ఫిర్యాదులో పేర్కొన్నారు. డొంగరి దేవేంద్ర, చుక్కా శిల్ప చైతన్య మహిళా సంఘానికి చెందినవారని పోలీసులే చెబుతున్నారు. ఈ సంఘం నిషేధిత జాబితాలో లేదు. వీరిద్దరికీ మావోయిస్టు పార్టీతో సంబంధాలు ఉన్నాయని చెప్పేందుకు ఎలాంటి ఆధారాలూ లేవు. బెయిల్‌ మంజూరు చేయండి’ అని కోరారు. ఎన్‌ఐఏ తరఫున డిప్యూటీ సొలిసిటర్‌ జనరల్‌ (డీఎ్‌సజీ) పసల పొన్నారావు వాదనలు వినిపించారు. చైతన్య మహిళా సం ఘం నిషేధిత జాబితాలో లేనప్పటికీ పిటిషనర్లు మావోయిస్టు పార్టీలో చురుకైన పాత్ర పోషిస్తున్నారని, ఇందుకు సంబంధించి ఎన్‌ఐఏ సాక్ష్యాధారాలు సేకరించిందని తెలిపారు. ఇరుపక్షాల వాదనలు పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం ఆ అప్పీళ్లను కొట్టివేస్తున్నట్లు ప్రకటించింది.

Updated Date - Mar 15 , 2025 | 04:56 AM