Share News

High Court: చిత్ర నిర్మాణ వ్యయంపై ఈడీ దర్యాప్తునకు ఆదేశించలేం

ABN , Publish Date - Mar 30 , 2025 | 04:37 AM

సంక్రాంతికి వస్తున్నాం సినిమా నిర్మాణ వ్యయంపై ఈడీతో దర్యాప్తు జరిపించాలని దాఖలైన పిల్‌ను హైకోర్టు కొట్టివేసింది. న్యాయస్థానాలు సినిమాల నిర్మాణ వ్యయంపై విచారణకు ఆదేశించలేవని కోర్టు స్పష్టం చేసింది. టికెట్ ధరల పెంపుపై విచారణకు అవసరం లేదని పేర్కొంటూ, ప్రస్తుత పిల్‌ ప్రజా ప్రయోజనం కోసం కాకుండా పబ్లిసిటీ కోసమే దాఖలైందని అభిప్రాయపడింది.

 High Court: చిత్ర నిర్మాణ వ్యయంపై ఈడీ దర్యాప్తునకు ఆదేశించలేం

‘సంక్రాంతికి వస్తున్నాం’పై దాఖలైన పిల్‌ కొట్టివేసిన హైకోర్టు

అమరావతి, మార్చి 29(ఆంధ్రజ్యోతి): ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా నిర్మాణ వ్యయంపై ఈడీతో దర్యాప్తు చేయించాలంటూ దాఖలైన పిల్‌ను హైకోర్టు కొట్టివేసింది. సినిమాల నిర్మాణ వ్యయంపై న్యాయస్థానాలు విచారణకు ఆదేశించలేవని, ఇది పూర్తిగా కార్యనిర్వాహక వ్యవస్థ పరిధిలోని వ్యవహారమని తేల్చిచెప్పింది. సినిమా నిర్మాణ వ్యయంపై దర్యాప్తు చేయాలని ఈడీని ఆదేశించాలనడం కోర్టు విచారణ ప్రక్రియను దుర్వినియోగం చేయడమేనని అభిప్రాయపడింది. పిటిషనర్‌ ఎలాంటి ప్రాథమిక ఆధారాలూ లేకుండా, ఊహాజనితంగా పిల్‌ దాఖలు చేయడంపై అభ్యంతరం తెలిపింది. ప్రస్తుత పిల్‌ను ప్రజా ప్రయోజనం కోసం కాకుండా పబ్లిసిటీ కోసం దాఖలు చేశారని అభిప్రాయపడింది. అదనపు షోల ప్రదర్శన ఇప్పటికే పూర్తయినందున టికెట్‌ ధరల పెంపు విషయంలో విచారించాల్సింది ఏమీ లేదని తెలిపింది. టికెట్‌ ధరల పెంపును 10 రోజులకే పరిమితం చేస్తూ 2022 మార్చి 7న జారీ చేసిన జీవో 13ను సవరించాలనే ప్రతిపాదనలు ఉన్నాయని ప్రభుత్వం చెబుతోందని గుర్తు చేసింది. ఈ నేపథ్యంలో సంక్రాంతికి వస్తున్నాం సినిమా టికెట్‌ ధర పెంపు, అదనపు షోలకు అనుమతిస్తూ ఈ ఏడాది జనవరి 8న రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన మెమోను సవాల్‌ చేస్తూ దాఖలైన పిల్‌ను కొట్టివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్‌, జస్టిస్‌ చీమలపాటిరవితో కూడిన ధర్మాసనం ఇటీవల తీర్పు ఇచ్చింది.


ఈ వార్తలు కూడా చదవండి

CM Chandrababu: ఆ అమరజీవి త్యాగాన్ని స్మరించుకుందాం..

Minister Ramanaidu: ఏపీని ధ్వంసం చేశారు.. జగన్‌పై మంత్రి రామానాయుడు ఫైర్

Srisailam: శ్రీశైలం వెళ్లే భక్తులకు అలర్ట్.. కొత్త తరహా మోసం

For More AP News and Telugu News

Updated Date - Mar 30 , 2025 | 04:37 AM