High Court: అధికార పరిధి దాటి వ్యవహరించారు
ABN, Publish Date - Mar 22 , 2025 | 04:37 AM
వాటిని సస్పెండ్ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఏజెన్సీ డివిజనల్ ఆఫీసర్ చర్య అధికార పరిధి దాటి వ్యవహరించడమేనని వ్యాఖ్యానించింది. ఇలాంటి చర్యలను అనుమతించబోమని పేర్కొంది.

రంపచోడవరం డివిజనల్ ఆఫీసర్ ప్రొసీడింగ్స్‌పై హైకోర్టు ఆక్షేపణ
ప్రొసీడింగ్స్‌ను సస్పెండ్ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు
అమరావతి, మార్చి 21(ఆంధ్రజ్యోతి): ఏజెన్సీ పరిధిలోని డివిజనల్ ఆఫీసర్ కోర్టులలో ప్రాక్టీస్ చేసేందుకు కాంపిటెంట్ అథారిటీ నుంచి అనుమతి తీసుకోవాలంటూ రంపచోడవరం ఏజెన్సీ డివిజనల్ ఆఫీసర్/సబ్ కలెక్టర్ ఈనెల 7న ఇచ్చిన ప్రొసీడింగ్స్‌ను హైకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. వాటిని సస్పెండ్ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఏజెన్సీ డివిజనల్ ఆఫీసర్ చర్య అధికార పరిధి దాటి వ్యవహరించడమేనని వ్యాఖ్యానించింది. ఇలాంటి చర్యలను అనుమతించబోమని పేర్కొంది. ఈ వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని వ్యాజ్యంలో ప్రతివాదులుగా ఉన్న గిరిజన సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శి, డైరెక్టర్, అల్లూరి జిల్లా కలెక్టర్, రంపచోడవరం సబ్‌కలెక్టర్‌కు నోటీసులు జారీ చేసింది. విచారణను వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సత్తి సుబ్బారెడ్డి గురువారం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు. ఏజెన్సీ పరిధిలోని డివిజనల్ ఆఫీసర్ కోర్టులలో ప్రాక్టీస్ చేసేందుకు కాంపిటెంట్ అథారిటీ నుంచి అనుమతి తీసుకోకుంటే చట్టప్రకారం తగిన చర్యలు తీసుకుంటామంటూ రంపచోడవరం ఏజెన్సీ డివిజనల్ ఆఫీసర్ ఈ నెల 7న ఇచ్చిన ప్రొసీడింగ్స్‌ను సవాల్ చేస్తూ అడ్వొకేట్ వెంకట రత్న ప్రకాశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషనర్ తరఫున న్యాయవాది ఎన్.శివారెడ్డి వాదనలు వినిపించారు.
ఇవి కూడా చదవండి:
Salary Hike: సీఎం సహా ఎమ్మెల్యేలందరికీ 100 శాతం వేతనాల పెంపు
Amit Shah: మెడికల్, ఇంజనీరింగ్ విద్యను తమిళంలో అందిస్తాం: అమిత్‌షా
MLAs: ఈ ఎమ్మెల్యేల సంపద తెలిస్తే.. నోరెళ్లబెట్టాల్సిందే
Updated Date - Mar 22 , 2025 | 04:37 AM