ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

హైందవ శంఖారావం విజయవంతం

ABN, Publish Date - Jan 08 , 2025 | 12:02 AM

విజయవాడ సమీపంలో ఈనెల 5వ తేది నిర్వహించిన హైందవ శం ఖారావం 10 లక్షల మందితో విజయవంతం అయ్యిందని అఖండ నవభారత నిర్మాణ్‌ అధ్యక్షుడు నారదరెడ్డి పేర్కొ న్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న అఖండ నవభారత నిర్మాణ్‌ అధ్యక్షుడు నారదరెడ్డి

మదనపల్లె టౌన, జనవరి 7(ఆంధ్రజ్యోతి): విజయవాడ సమీపంలో ఈనెల 5వ తేది నిర్వహించిన హైందవ శం ఖారావం 10 లక్షల మందితో విజయవంతం అయ్యిందని అఖండ నవభారత నిర్మాణ్‌ అధ్యక్షుడు నారదరెడ్డి పేర్కొ న్నారు. మంగళవారం స్థానిక ఎస్‌బీఐ కాలనీలో ఆయన విలేకర్లతో మాట్లాడు తూ హిందూమతంలో కులభేదాలు లేకుండా అందరిని ఏకతాటిపై తీసుకొ చ్చేందుకు నిర్వహించిన హైందవశంఖారావం ధర్మ పరిరక్షణకు తొలి అడుగు పడిందన్నారు. అఖండ భారతంలో తొలిసారిగా మన రాష్ట్రంలోనే హైందవ శంఖారావం నిర్వహించడం, యువత నుంచి వృద్దుల వరకు పెద్దసంఖ్యలో తరలివచ్చారన్నారు. ఈ బహిరంగ సభ హిందువుల ఐక్యతను చాటి చెప్పింద న్నారు. దేవాలయాల ఆస్థుల పరిరక్షణకు పీఠాధిపతులు, మేధావులు, వీహెచ పీ నాయకులు హిందువులకు దిశానిర్దేశం చేశారన్నారు. రాష్ట్రంలో 10లక్షల ఎకరాల హిందూ ఆలయాల భూములు అన్యాక్రాంతం అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. టీటీడీ ఆలయాల పవిత్రతను కాపాడేందుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో నారాయణ, చంద్రశేఖర్‌రెడ్డి తదిత రులు పాల్గొన్నారు.

Updated Date - Jan 08 , 2025 | 12:02 AM