Home Minister Anitha: అనుమతి లేకుంటే చర్యలు
ABN , Publish Date - Apr 15 , 2025 | 04:31 AM
హోంమంత్రి వంగలపూడి అనిత అనధికార బాణసంచా తయారీ కేంద్రాలను గుర్తించి, భద్రతా చర్యలు పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనకాపల్లి జిల్లా కైలాసపట్నం పేలుడు ఘటనపై విచారణ జరుగుతున్నది. మృతుల కుటుంబాలకు రూ. 15 లక్షల ఎక్స్‌గ్రేషియా, గాయపడిన వారికి ప్రభుత్వ వైద్య సేవలు అందిస్తామని పేర్కొన్నారు.

బాణసంచా తయారీ కేంద్రాలకు మంత్రి అనిత హెచ్చరిక
మరణించిన వారి కుటుంబాలకు 17 లక్షలు,గాయపడిన వారికి 1.5 లక్షలు నష్టపరిహారం
అనకాపల్లి, ఏప్రిల్ 14(ఆంధ్రజ్యోతి): ‘రాష్ట్రవ్యాప్తంగా అనధికార బాణసంచా తయారీ కేంద్రాలను గుర్తించి, శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం. అనుమతులున్నా భద్రతా చర్యలు పాటించకుంటే సహించేది లేదు’ అని హోంమంత్రి వంగలపూడి అనిత హెచ్చరించారు. సోమవారం అనకాపల్లిలో ఆమె మీడియాతో మాట్లాడారు. ‘అనకాపల్లి జిల్లాలో లైసెన్స్‌లు ఉన్నవి, లేనివి... కలిపి మొత్తం 40 వరకు బాణసంచా కేంద్రాలు నడుస్తున్నాయి. కోటవురట్ల మండలం కైలాసపట్నంలో ప్రమాదం చోటుచేసుకోవడం దురదృష్టకరం. ఈ సంఘటనపై ఇప్పటికే విచారణ మొదలైంది. లక్ష్మీ గణేశ్ ఫైర్‌వర్క్స్ నిర్వాహకులు ఇద్దరిపై (ఏ1, ఏ2) కేసు నమోదు చేశాం. వారిలో ఒకరు ఇప్పటికే చనిపోగా, జానకిరామ్ అనే వ్యక్తి 50 శాతం కాలిన గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కైలాసపట్నం పేలుడు ఘటనలో మృతి చెందిన ఎనిమిది మంది కుటుంబాలకు ప్రభుత్వం రూ.15 లక్షలు చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. ప్రధాన మంత్రి కూడా మరో రూ.2 లక్షలు వంతున బాధిత కుటుంబాలకు ప్రకటించారు. ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులు ఎనిమిది మందికీ రాష్ట్ర ప్రభుత్వం రూ.లక్ష చొప్పున, ప్రధాన మంత్రి నుంచి రూ.50 వేలు ఎక్స్‌గ్రేషియా అందుతుంది. క్షతగాత్రుల పూర్తి వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుంది. త్వరలోనే చెక్కులు అందజేస్తాం’ అని మంత్రి అనిత పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Visakhapatnam: మరో 24 గంటల్లో డెలివరీ కానున్న భార్య.. భర్త ఎంత దారుణానికి ఒడికట్టాడో..
PM Narendra Modi: కంచ గచ్చిబౌలి భూములు.. కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగిన ప్రధాని మోదీ..