Illegal Mining : రాజధానిలో మట్టి దొంగలు!
ABN, Publish Date - Jan 12 , 2025 | 06:55 AM
రాజధాని అమరావతిలో మళ్లీ దొంగలు చెలరేగిపోయారు. రెండు రోజులుగా లారీలు, పొక్లెయిన్‌లతో మంగళగిరి మండలం కృష్ణాయపాలెం-శాఖమూరు మీదుగా అనంతవరం వెళ్లే రోడ్డు తవ్వుకుని కంకర తరలించుకుపోతున్నారు. ఈ విషయాన్ని గమనించిన
కృష్ణాయపాలెం-శాఖమూరు రోడ్డు తవ్వేసిన దుండగులు
రెండ్రోజులుగా కంకర తరలిస్తున్నా పట్టించుకోని అధికారులు
గుంటూరు, జనవరి 11(ఆంధ్రజ్యోతి): రాజధాని అమరావతిలో మళ్లీ దొంగలు చెలరేగిపోయారు. రెండు రోజులుగా లారీలు, పొక్లెయిన్‌లతో మంగళగిరి మండలం కృష్ణాయపాలెం-శాఖమూరు మీదుగా అనంతవరం వెళ్లే రోడ్డు తవ్వుకుని కంకర తరలించుకుపోతున్నారు. ఈ విషయాన్ని గమనించిన పశువుల కాపరులు రైతులకు తెలియజేశారు. గుర్తు తెలియని కొందరు పొక్లెయిన్లు, లారీలతో వచ్చి రోడ్డును తవ్వుకుని కంకర ఎత్తుకుపోయారని వారు రైతులకు తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా ఇలా మట్టి, కంకర దొంగతనం జరగడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు, సీఆర్డీఏ అధికారుల నిర్లక్ష్యం, వైఫల్యం కారణంగానే ఈ దోపిడీలు జరుగుతున్నాయని రైతులు ఆరోపిస్తున్నారు. దాదాపు 200 మీటర్ల మేర 3 అడుగుల లోతున రోడ్డు తవ్విన దుండగులు, 25-30 టిప్పర్లతో మట్టి, కంకర దోచుకుపోయారు. యువనేత, లోకేశ్ సొంత నియోజకవర్గంలో ఈ ఘటన జరగడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. కూటమి ప్రభుత్వంలోనూ అక్రమార్కులు ఇలా చెలరేగిపోవడానికి ప్రభుత్వ ధోరణి, అధికారుల నిర్లక్ష్యం, వైఫల్యమే కారణమని రైతులు భావిస్తున్నారు.
Updated Date - Jan 12 , 2025 | 06:55 AM