Justice PV Jyothirmayi: శివయ్య సేవలో జస్టిస్ జ్యోతిర్మయి
ABN, Publish Date - Apr 03 , 2025 | 04:51 AM
హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పీవీ జ్యోతిర్మయి దంపతులు గుంటూరు జిల్లా పెదకాకాని శ్రీమల్లేశ్వరస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేదపండితులు ఆశీర్వదించి, శేష వస్త్రంతో సత్కరించారు.

పెదకాకాని, ఏప్రిల్ 2(ఆంధ్రజ్యోతి): గుంటూరు జిల్లా పెదకాకాని శ్రీమల్లేశ్వరస్వామిని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పీవీ జ్యోతిర్మయి దంపతులు బుధవారం దర్శించుకున్నారు. శ్రీ భ్రమరాంబ సమేత మల్లేశ్వరస్వామి వార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జస్టిస్ జ్యోతిర్మయి దంపతులను వేదపండితులు ఆశీర్వదించి, స్వామి వారి శేషవస్త్రంతో సత్కరించి లడ్డూ ప్రసాదాలు, స్వామి వారి చిత్రపటం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఉప కమిషనరు గోగినేని లీలాకుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి:
FD Comparison: ఎస్బీఐ vs యాక్సిస్ బ్యాంక్.. వీటిలో ఏ FD బెస్ట్, దేనిలో ఎక్కువ వస్తుంది..
Samsung: శాంసంగ్ ఏసీల్లో సరికొత్త టెక్నాలజీ..స్మార్ట్ థింగ్స్ కనెక్షన్ సహా అనేక సౌకర్యాలు..
Updated Date - Apr 03 , 2025 | 04:51 AM