ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఆలయ భూములు ఆక్రమిస్తే చర్యలు

ABN, Publish Date - Jan 07 , 2025 | 11:51 PM

దేవాలయా లకు చెందిన భూములను ఆక్రమిస్తే కఠిన చర్య లు తీసుకుంటామని జిల్లా దేవదాయశాఖ అధికా రి సి.విశ్వనాథన హెచ్చరించారు.

కలికిరి సదస్సులో అర్జీలు స్వీకరిస్తున్న తహసీల్దారు మహేశ్వరీబాయి

తంబళ్లపల్లె, జనవరి 7(ఆంధ్రజ్యోతి): దేవాలయా లకు చెందిన భూములను ఆక్రమిస్తే కఠిన చర్య లు తీసుకుంటామని జిల్లా దేవదాయశాఖ అధికా రి సి.విశ్వనాథన హెచ్చరించారు. మంగళవారం జుంజురపెంటలో నిర్వహించిన రెవెన్యూ సదస్సు లో ఆయన మాట్లాడుతూ...దేవాలయ భూముల ఆక్రమణదారులకు చట్ట ప్రకారం నోటీసులిచ్చి నిబంధనల మేరకు తొలగిస్తామన్నారు. కొన్ని చోట్ల దేవాలయ భూములకు కౌలు చెల్లించకుం డా అనుభవిస్తున్నారని అటువంటి రైతులు వెం టనే కౌలు చెల్లించి మండల ఎండోమెంట్‌ అధికా రుల నుంచి రసీదులు పొందాలని సూచించారు. కాగా, తంబళ్లపల్లె మండలంలో గత నెల 6వ తేదీ నుంచి 19 గ్రామాలలో నిర్వహించిన రెవె న్యూ సదస్సులు మంగళవారంతో ముగిసాయి. ఈ సదస్సులో ప్రజలు, రైతుల నుంచి 7 విన తు లు వచ్చినట్లు అధికారులు తెలిపారు. కార్యక్రమం లో అడిషనల్‌ ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ జోగేం ద్ర, డీటీ రవినాయక్‌, ఎఫ్‌బీవో రామరాజు, దేవ దాయ శాఖ రికార్డు అసిస్టెంట్‌ కొండకిట్ట, రెవె న్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మాన్యం భూములను ఫ్రీహోల్డ్‌ చేయొద్దు

్దమదనపల్లె టౌన, జనవరి 7(ఆంధ్రజ్యోతి): ప్రభు త్వ రికార్డుల పరంగా దేవుడి మాన్యంగా నమో దైన భూములను ఫ్రీహోల్డ్‌ చేయవద్దంటూ దేవ దాయశాఖ అధికారి రమణ రెవెన్యూ అధికారుల ను కోరారు. మంగళవారం మండలంలోని చిప్పిలి గ్రామంలో రెవెన్యూ సదస్సులో రమణ మాట్లాడు తూ చిప్పిలి రెవెన్యూ గ్రామంలో యోగభోగేశ్వరా లయానికి విలువైన భూములకు దేవదాయశాఖ పేరిట పాసుపుస్తకాలు మంజూరు చేయాలని అధికారులకు విన్నవించారు. వాటితో పాటు చిప్పి లి ఎస్‌ఎస్‌ ట్యాంకు ముంపు భూములకు పరిహా రం ఇవ్వాలని బాధితులు, రింగ్‌బండ్‌ నిర్మాణంతో వర్షపునీరు తమ గ్రామంలోకి వచ్చే అవకాశం ఉందని ప్రజలు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో డీఎల్‌డీవో అమరనాథరెడ్డి, తహసీల్దార్‌ ఖాజాభీ, పాల్గొన్నారు.

సమస్యల పరిష్కారానికే రెవెన్యూ సదస్సులు

ములకలచెరువు, జనవరి 7 (ఆంధ్రజ్యోతి): భూ సమస్యలకు శాశ్విత పరిష్కారం చూపేందుకే ప్రభుత్వం రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తోందని తహసీల్దార్‌ ప్రదీప్‌ పేర్కొన్నారు. మండలంలోని పాత ములకలచెరువు గ్రామ సచివాలయంలో మంగళవారం రెవెన్యూ సదస్సులో భూ సమస్య లపై అర్జీలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో సర్వేయర్‌ ఫిరోజ్‌, సిబ్బంది పాల్గొన్నారు.

కురబలకోటలో:భూ సమస్యలను పరిష్కరించడ మే ప్రభుత్వ ధ్యేయమని తహశీల్దార్‌ తఫశ్విని పేర్కొన్నారు. మంగళవారం మండలంలోని అంగ ళ్లులో రెవెన్యూ సదస్సులో ప్రజల నుంచి వచ్చిన వివిధ రకాల సమస్యలపై ఆర్జీలను తీసుకొన్నారు. ఈ సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామన్నారు. కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ పరిశీలకుడు మల్లికార్జుననాయుడు, ఎంపీడీవో గంగయ్య, ఆర్‌ఐ బాలసుబ్రమణ్యం పాల్గొన్నారు.

రీసర్వే గ్రామాల్లో 1బీ రావడం లేదు

పెద్దమండ్యం, జనవరి 7(ఆంధ్రజ్యోతి)రీసర్వే గ్రా మాలలో భూములకు సంబంధించిన 1బీ రావ డంలేదు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని తహ సీల్దార్‌ సయ్యద్‌ ఆహ్మద్‌ను ఎంపీటీసీ రక్మాంగధ రెడ్డి, మండల టీడీపీ మాజీ అధ్యక్షుడు సిద్దవరం ప్రసాద్‌ కోరారు. మండలంలోని సిద్దవరం సచి వాలయం వద్ద మంగళవారం రైతు సదస్సులో తహసీల్దార్‌ మాట్లాడుతూ రైతు సదస్సులో వచ్చి న రైతు సమస్యలతో పాటు ప్రజలు అన్ని రకాల అర్జీలను స్వీకరించి ఆయా శాఖల అధికారులకు పంపుతున్నట్లు తెలిపారు. అర్జీల పరిష్కారానికి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు. దేవ దాయశాఖ ఏఈవో విశ్వనాధ, ఆర్‌ఐ రమేష్‌, సర్వేయర్‌ హసీనతాజ్‌, మండల బీజేపీ అధ్య క్షుడు లక్ష్మీనారాయణ, రామచంద్ర,పాల్గొన్నారు.

రీ సర్వే తప్పులు చక్కదిద్దుతున్నాం

కలికిరి, జనవరి 7 (ఆంధ్రజ్యోతి): రీ సర్వేలో జరి గిన పొరపాట్లను చక్కదిద్దే పని మొదలు పెట్టా మని తహసీల్దారు మహేశ్వరీబాయి చెప్పారు. మంగళవారం స్థానిక గ్రామ పంచాయతీ ఆవర ణలో జరిగిన కలికిరి గ్రామ రెవెన్యూ సదస్సులో తహసీల్దారు మాట్లాడుతూ రైతులు అందజేస్తు న్న అన్ని రకాల దరఖాస్తులను వెంటనే పరిష్క రించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. కలికిరి గ్రామంలోని దేవదాయ భూములను ఒకే ఆల యం పేరుతో రికార్డుల్లో నమోదు చేశారని వాటి ని సవరించాలని ఆలయాల ఈవో మంజుల దర ఖాస్తు చేశారు. లక్ష్మీనరసింహస్వామి, రాయదు ర్గం లక్ష్మీనరసింహస్వామి, వేంకటేశ్వరస్వామి, య ల్లమ్మ దేవతల పేర్లతో ఆయా భూములను నమోదు చేయాలని ఆమె కోరారు. ఈ సదస్సులో నోడల్‌ అధికారి జయప్రకాష్‌, సర్పంచు ఎల్ల య్య, పంచాయతీ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు యోగేష్‌ రెడ్డి, మండల టీడీపీ ఉపాధ్యక్షుడు రెడ్డెప్ప రెడ్డి, సాగునీటి సంఘం మాజీ అధ్యక్షుడు వేంపల్లె అబ్దుల్‌ ఖాదర్‌, పంచాయతీ కార్యదర్శి అశోక్‌, సర్వేయర్‌ రెడ్డెప్ప, వీఆర్వోలు, సచివాలయ సర్వేయర్లు, రైతులు పాల్గొన్నారు.

చెరువు ఆక్రమణలను తొలగించండి

గుర్రంకొండ, జనవరి 7(ఆంధ్రజ్యోతి):ఖండ్రిగ గ్రామంలో ఉన్న మురాద్‌బీకుంట ఆక్రమణలను తొలగించాలని గ్రామస్థులు తహశీల్దార్‌ శ్రీనివాసు లకు ఫిర్యాదు చేశారు. మండలంలోని ఖండ్రిగ గ్రామంలో మంగళవారం రెవెన్యూ సదస్సులో మురాద్‌బీకుంట ఆక్రమణలకు గురైందని, కుంట కు నీరు వచ్చే వంకలను రియల్‌ వ్యాపారులు ఆక్రమించుకొని మూసేశారని తెలిపారు. అలాగే కొందరు వంక స్థలాన్ని ఆక్రమించుకొని ప్లాట్లు వేసి అమ్మేస్తున్నారని తహశీల్దార్‌ దృష్టికీ తీసుకొ చ్చారు. అక్రమాలను గుర్తించి చర్యలు తీసుకొం టామని తహసీల్దార్‌ తెలిపారు. కార్యక్రమంలో నోడల్‌ అధికారి లక్ష్మీపతి, వీఆర్వో పాల్గొన్నారు.

Updated Date - Jan 07 , 2025 | 11:51 PM