ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

రారండోయ్‌.. వేడుకచేద్దాం

ABN, Publish Date - Jan 13 , 2025 | 11:12 PM

రారండో య్‌.. వేడుకచేద్దామంటూ..సంక్రాంతి పండుగ వేడుకలను ప్రజ లు ఆనందోత్సాహాలతో అంగరంగ వైభవంగా జరుపుకుంటు న్నారు.

కలకడ ఎర్రకోటపల్లెలో భోగి మంటలు

భోగి పండుగతో ప్రారంభమైన సంక్రాంతి వేడుకలు రంగవల్లులతో అలరిస్తున్న పల్లెలు, పట్టణాలు

మదనపల్లె అర్బన/పీలేరు, జనవరి 13(ఆంధ్రజ్యోతి): రారండో య్‌.. వేడుకచేద్దామంటూ..సంక్రాంతి పండుగ వేడుకలను ప్రజ లు ఆనందోత్సాహాలతో అంగరంగ వైభవంగా జరుపుకుంటు న్నారు. సంబరాల్లో తొలి ఘట్టమైన భోగి పండుగను సోమవా రం ప్రజలు వేకువ జామునే సాంప్రదాయబద్ధంగా తమ లోగిళ్ల ముందు భోగి మంటలు వేసి ఇంటిలోని పాత సామగ్రిని అం దులోవేసి ప్రజలు సంతోషంగా పండుగకు స్వాగతం పలికారు. చిన్నా పెద్ద తేడా లేకుండా అందరూ భోగి సంబరాల్లో పాల్గొ న్నారు. పీలేరు కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయం ఎదుట ఆర్యవైశ్య సంఘం, మహిళా మండలి, వాసవీ క్లబ్‌ గ్రేటర్‌, వాసవీ కపుల్స్‌ క్లబ్‌ సభ్యులు భోగి మంటలు వేసి దాని చుట్టూ కోలా టాలతో పండుగను వైభవంగా జరుపుకున్నారు. స్థానిక పలువు రు ఉపాధ్యాయ సంఘ నేతలు, మానవత సంస్థ సభ్యులు భోగి మంటలు వేశారు. అంతకు ముందు సంక్రాంతి లక్ష్మికి స్వాగతం పలుకుతూ తమ ఇంటి గుమ్మాలను అందంగా అలంకరించి మహి ళలు రంగురంగుల రంగవల్లులతో శోభాయమానంగా అలంకరించారు. మదనపల్లెలో భోగి పండుగను సోమవారం వైభవంగా జరుపుకున్నారు. స్థానిక దేవళంవీధిలో ప్రసన్నవెంక టరమణ స్వామి ఆలయం సమీపంలో భోగిమంటలు వేశారు.

తంబళ్లపల్లెలో: తెలుగువారి సంప్రదాయానికి ప్రతీక సంక్రాంతి పండుగ మొదటి రోజైన భోగి పండుగను సోమవారం మండల ప్రజలు వైభవంగా జరుపుకున్నారు. వేకువజాము నుంచే పెద్ద లు, యువత, పిల్లలు ఇళ్ల ముందు భోగి మంటలు వేశారు.

కలకడలో:సంక్రాంతిలో భాగమైన భోగి పండుగను మండల ప్రజలు సోమవారం వేడుకగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా మహిళలు ప్రత్యేకంగా రంగు రంగుల రంగవ ల్లులు వేసి వాటి మధ్యలో గొబ్బెలను ఉంచి పండుగ శోభన సంతరింపజేశారు.

కురబలకోటలో: మండలంలో పలు గ్రామాల్లో వేకువ జాము న ప్రజలు తమ ఇళ ముందు భోగి మంటలు వేశారు. అంగళ్ళు సమీపంలోని మిట్స్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో చైర్మన ధ్వారకనాథ్‌ ఆధ్వర్యంలో భోగి మంటలు వేశారు.

గుర్రంకొండలో:మండలంలోని అన్ని గ్రామాల్లో భోగి పండుగ వేడుకలను ప్రజలు సోమవారం వైభవంగా జరుపుకున్నారు. ఉద యాన్నే ఇళ్ల ముంగిట ప్రజలు భోగి మంటలను వేసి ఇళ్లలోని పాత వస్తువులను వేసి భోగి పండుగ ను జరుపుకున్నారు.

Updated Date - Jan 13 , 2025 | 11:12 PM