ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పగలు డంపింగ్‌..రాత్రి లిఫ్టింగ్‌

ABN, Publish Date - Jan 03 , 2025 | 11:35 PM

వాల్మీకిపురం మండల వ్యాప్తంగా ఇసుక అక్రమ రవాణాకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది.

వాల్మీకిపురం మండలం సాకిరేవుపల్లె సమీపంలో ఇసుకను అక్రమంగా డంపింగ్‌ చేసిన దృశ్యం

ఇసుక అక్రమ రవాణాపై చర్యలు ఏవీ?

అధికారులు పట్టించుకోవడంలేదంటూ విమర్శలు

వాల్మీకిపురం, జనవరి 3(ఆంధ్రజోత్యి): వాల్మీకిపురం మండల వ్యాప్తంగా ఇసుక అక్రమ రవాణాకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. అధికారుల పర్యవేక్షణ లోపమో..?లేదా వారే అండగా ఉన్నారో తెలియదు కానీ ఇసుక అక్రమ రవాణా మాత్రం ఆగడం లేదు. నిత్యం వేకువ జామున నాలుగు గంటలకు మొదలయ్యే ఇసుక అక్రమ రవాణా పట్టణంలోని బైపాస్‌ రోడ్డు గుండా జోరుగా సాగుతున్నా అడిగేవారే లేరు. స్థానిక అవసరాలకు ఉచితం అన్న ఇసుక ప్రస్తుతం బయటి ప్రాంతాలకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్న మాఫియాదే రాజ్యం అన్న విధం గా తయారైంది. నిఘా పెట్టాల్సిన అధికారులు కూడా రాజకీయ ఒత్తిళ్లతో చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారన్న విమర్శలువస్తున్నాయి. రాత్రి సమయాలలో గస్టీ పోలీసులు ఇసుక ట్రాక్టర్లపై చర్యలు తీసుకోకపోగా లాలూచిపడి వదిలేస్తున్నార న్న ఆరోపణలున్నాయి. మండల వ్యాప్తంగా బాహుదా కాలువ ప్రాంతాన్ని ఇప్ప టికే ఇసుక మాఫియా గుల్ల చేశారు. ఇసుక అక్రమాలపై ఫిర్యాదులు చేసినా ప్రయోజనం లేదన్నది గ్రామీణ ప్రాంత ప్రజలు, రైతుల ఆరోపణ. మండలం లోని కూరపర్తి, చింతపర్తి, మాధవరంపల్లె భోగంపల్లె రిజర్వాయర్‌ తదితర ప్రాం తాలలో జరుగుతున్న ఇసుక అక్రమ రవాణా పట్ల ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

ఇసుక అక్రమాలపై ముమ్మర నిఘా..

వాల్మీకిపురం సర్కిల్‌ పరిధిలోని వాల్మీకిపురం, గుర్రంకొండ మండలాలలో ఇసుక అక్రమ రవాణా, డంపింగ్‌లపై ఇప్పటికే ముమ్మర నిఘాపెట్టి చర్యలు తీసుకుం టున్నాం. స్థానిక అవసరాల నిమిత్తం కాకుండా బయటిప్రాంతాలకు అక్రమంగా రవాణా చేసినా, రహస్య డంపింగ్‌లకు పాల్పడిన ఎంతటి వారైనా ఉపేక్షించ బోం. చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం. అక్రమ రవాణా, డంపింగ్‌ వివరాలను ప్రజలు కూడా సహకరించి పోలీసులకు తెలియజేయాలి.

-ప్రసాద్‌బాబు, సీఐ, వాల్మీకిపురం

Updated Date - Jan 03 , 2025 | 11:35 PM