వీరులారా.. మీ త్యాగం మరువలేం

ABN, Publish Date - Feb 15 , 2025 | 12:09 AM

పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన వీర జవాన్లకు ఇడుపులపాయ ట్రిపుల్‌ఐటీలో ఘనంగా నివాళులర్పించారు.

వీరులారా.. మీ త్యాగం మరువలేం
పుల్వామా ఉగ్రదాడిలో వీరజవాన్లకు నివాళిగా ట్రిపుల్‌ఐటీలో రక్తదానం చేస్తున్న విద్యార్థులు

వేంపల్లె, ఫిబ్రవరి 14 (ఆంధ్రజ్యోతి): పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన వీర జవాన్లకు ఇడుపులపాయ ట్రిపుల్‌ఐటీలో ఘనంగా నివాళులర్పించారు. శుక్రవారం ఇడుపులపాయ ట్రిపుల్‌ఐటీలో వీరజవాన్లకు నివాళిగా ఎనఎ్‌సఎ్‌స ఆధ్వర్యలో రక్తదాన శిబిరం ఏర్పాటుచేశారు. విద్యార్థులు, ఎనఎ్‌సఎ్‌స అధికారి అనిల్‌కుమార్‌రెడ్డితో పాటు పలువురు రక్తదానం చేశారు. ఈ సందర్భంగా రక్తదానం చేసిన విద్యార్థులను ట్రిపుల్‌ఐటీ డైరెక్టర్‌ కుమారస్వామి గుప్త, ఏఓ రవికుమార్‌లు అభినందించారు. ఈ కార్యక్రమంలో ట్రిపుల్‌ఐటీ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 15 , 2025 | 12:09 AM