అంబరాన్నంటిన హోళీ సంబరాలు

ABN, Publish Date - Mar 14 , 2025 | 11:14 PM

పలు ప్రాంతాల్లో శుక్రవారం హోళీ పండుగ సంబరాలు అంబరాన్నంటాయి.

అంబరాన్నంటిన హోళీ సంబరాలు
రైల్వేకోడూరులో సంబరాలు జరుపుకుంటున్న దృశ్యం

రైల్వేకోడూరు, మార్చి 14(ఆంధ్రజ్యోతి): పలు ప్రాంతాల్లో శుక్రవారం హోళీ పండుగ సంబరాలు అంబరాన్నంటాయి. చిన్న లు, పెద్దలు అనే తేడా లేకుండా రంగులు చల్లుకుని సంబరాలు జరుపుకున్నారు. అలాగే ప్రతి వీధిలోను చిన్న పిల్లలు వివిధ రకాల రంగులు చల్లుకుని పండుగ చేసుకున్నారు. మార్వాడీలు మాట్లాడుతూ ప్రధానంగా ఆనందం కోసమే హోళీ పండుగను జరుపుకుంటున్నారని తెలిపారు.

నందలూరు: నందలూరు రైల్వేకేంద్రంలో రైల్వే కార్మికులు ఘనంగా హోళీ సంబరాలు జరుపుకున్నారు. ఒకరినొకరు రం గులు పూసుకుంటూ నృత్యాలు చేస్తూ ఉత్సాహంగా ఉల్లాసంగా పండుగ చేసుకున్నారు. మహిళలు వారి గృహాల్లో ఉదయాన్నే లేచి వివి రకాల పిండివంటలు చేసి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించి పండుగ చేసుకున్నారు. పిల్లలు సైతం ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ హోళీ పండుగను నిర్వహించుకున్నారు. చీఫ్‌ లోకో ఇనస్పెక్టర్‌ పెంచలయ్య, రైల్వే కార్మికులు పాల్గొన్నారు.

రామాపురం: హోళీ పండుగ ప్రజల జీవితాలను సప్తవర్ణ శోభితం చేయాలని గాలివీటి సురేంద్రారెడ్డి, మార్చురీ చెన్నకృష్ణారెడ్డి, నాగిరెడ్డి, దేవదర్శనరెడ్డి ఆకాంక్షించారు. హోళీ పండుగ ప్రజల జీవితాల్లో సంతోషం నింపాలన్నారు.

Updated Date - Mar 14 , 2025 | 11:14 PM