ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

రాజకీయాలకు అతీతంగా ఉద్యోగ అవకాశాలు

ABN, Publish Date - Jan 05 , 2025 | 11:22 PM

నిరుద్యోగులందరికీ ప్రతిభ ఆధారంగానూ, రాజకీయాలకు అతీతంగానూ ఉద్యోగ అవకాశాలు వస్తాయని ఎమ్మెల్సీ రామగోపాల్‌రెడ్డి పేర్కొన్నారు.

పులివెందుల జాబ్‌మేళలో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ రామగోపాల్‌రెడ్డి... హాజరైన నిరుద్యోగులు

పులివెందులలో ట్రైనింగ్‌ సెంటర్‌ ఏర్పాటుకు చర్యలు

జాబ్‌మేళాలో ఎమ్మెల్సీ రామగోపాల్‌రెడ్డి

పులివెందుల రూరల్‌, జనవరి 5 (ఆంధ్రజ్యోతి): నిరుద్యోగులందరికీ ప్రతిభ ఆధారంగానూ, రాజకీయాలకు అతీతంగానూ ఉద్యోగ అవకాశాలు వస్తాయని ఎమ్మెల్సీ రామగోపాల్‌రెడ్డి పేర్కొన్నారు. సీడాప్‌ - ఏపీఎ్‌సఎ్‌సడీసీ ఆధ్వర్యంలో మెగా జాబ్‌మేళాను ఆదివారం స్థానిక అహోబిలాపురం ప్రభుత్వ ఉన్నత (మెయిన) పాఠశాలలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో ఎమ్మెల్సీ మాట్లాడుతూ రెకమెండేషన ఉంటేనే ఉద్యోగాలు వస్తాయని ఎంతోమం ది నిరుత్సాహంగా ఉన్నారన్నారు. ఇలాంటి వారికోసం ముఖ్యమంత్రి చంద్రబాబునాయు డు, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ జాబ్‌మేళాకు తోడ్పాటునందించారన్నారు. పులివెందులకు 26 ప్రముఖ కంపెనీలను రప్పిం చామన్నారు. చిన్న ఉద్యోగం, చిన్న జీ తం అనుకోకుండా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. అలాగే ఇక్కడి నిరుద్యోగ యువతకు ఆసక్తి ఉన్న రం గంలో శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు త్వరలో పులివెందులలో ట్రైనింగ్‌ సెంటర్‌ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఈ జాబ్‌మేళాలో ఉద్యోగం రాని వారికి శిక్షణ ఇప్పించి ఉద్యోగం ఇప్పి స్తామని భరోసా ఇచ్చారు. జాబ్‌మేళా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 వరకు సాగింది. పులివెందుల ఏపీఎం గురురాజ్‌, వేముల ఏపీఎం ఆంజనేయులు, డీఆర్‌డీఏ పాల్గొన్నారు.

831 మందికి ఉద్యోగాలు

పులివెందులలో నిర్వహించిన మెగా జాబ్‌మేళాలో ఎల్‌ఐసీ, పేటీఎం, టాటా ఎలక్ర్టానిక్స్‌, టెక్‌ మహీంద్ర, ఆదిత్య బిర్లా, అజిల్‌ ఎయిర్‌పోర్టు, డిక్సన, అమర్‌రాజ, హెటిరో, ఐసీఐసీఐ బ్యాంక్‌ ఇలా మొత్తం 26 కంపెనీలు పాల్గొన్నాయి. 2325 మంది ఇంటర్వ్యూలకు హాజ రు కాగా 831 మందికి ఉద్యోగాలు లభించినట్లు తెలిపారు. 203 మంది షార్ట్‌లి్‌స్టలో ఉన్నట్లు సీడాప్‌ జేడీఎం వివరించారు. ఈ జాబ్‌మేళకు 3453 మంది రిజిస్టర్‌ చేసుకున్నట్లు తెలిపారు.

Updated Date - Jan 05 , 2025 | 11:22 PM