పల్లమ్మ తల్లి సేవలో ఎమ్మెల్యే శ్రీధర్
ABN, Publish Date - Mar 31 , 2025 | 11:31 PM
మండలంలోని నర్సింగరాజపురం పంచాయతీ పల్లంపాడు గ్రామంలో సోమవారం జరిగిన పల్లమ్మ తల్లి సేవలో రైల్వేకోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్, టీడీపీ నాయకురాలు ముక్కా వరలక్ష్మి పాల్గొ న్నారు.

పెనగలూరు, మార్చి 31 (ఆంధ్రజ్యోతి): మండలంలోని నర్సింగరాజపురం పంచాయతీ పల్లంపాడు గ్రామంలో సోమవారం జరిగిన పల్లమ్మ తల్లి సేవలో రైల్వేకోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్, టీడీపీ నాయకురాలు ముక్కా వరలక్ష్మి పాల్గొ న్నారు. అమ్మవానిఇ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. తొలిసారిగా పల్లంపాడుకు విచ్చేసిన ఎమ్మెల్యే శ్రీధర్, ము క్కా వరలక్ష్మీలకు పల్లమ్మ ఆలయ కమిటీ సభ్యులు, ఎనఆర్‌పురం గ్రామ పెద్దలు ఘనస్వాగతం పలికి సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండల ప్రజ లు ఆయురారోగ్య, సుఖసంతోషాలు, పాడి పంటలతో వర్ధిల్లాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు బత్తిన వేణుగోపాల్‌రెడ్డి, జనసే న రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాతంశెట్టి నా గేంద్ర, డీసీసీబీ మాజీ డైరెక్టర్ లేబాక శ్రీనివాసులరెడ్డి, బీఎల్ నరసింహారెడ్డి, జేసీ మండల ప్రధాన కార్యదర్శి గొబ్బూరు హరిక్రిష్ణరాయల్, మండల నాయకులు కొప్పోలు విజయభాస్కర్‌రెడ్డి, వి.పాలిరెడ్డి, ఎల్.రెడ్డయ్యరెడ్డి పాల్గొన్నారు.
నేడు అనంతంపల్లెకు ఎమ్మెల్యే రాక
పెనగలూరు, మార్చి 31 (ఆంధ్రజ్యోతి) : మండలంలోని అనంతంపల్లె గ్రామంలో మంగళవారం రైల్వేకోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పర్యటించనున్నారని ఎంపీడీవో ఎస్.విజయరావు తెలిపారు. పశువుల షెడ్ ప్రా రంభోత్సవం, సిమెంటు రోడ్డు నిర్మాణానికి భూమిపూజ,పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారని తెలిపారు. ఎమ్మెల్యే పర్యటనను గ్రామ ప్రజలు విజయవంతం చేయాలని ఆయన కోరారు.
Updated Date - Mar 31 , 2025 | 11:31 PM