ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

నారాయణే.. నమోస్తుతే..!

ABN, Publish Date - Jan 10 , 2025 | 11:57 PM

నారాయణే.. నమోస్తుతి..! అంటూ వైకుంఠ ఏకా దశి పర్వదినాన్ని ప్రజలు శుక్రవారం భక్తిశ్రద్ధలతో వైభ వంగా జరుపుకున్నారు.

నారాయణే.. నమోస్తుతి..! అంటూ వైకుంఠ ఏకా దశి పర్వదినాన్ని ప్రజలు శుక్రవారం భక్తిశ్రద్ధలతో వైభ వంగా జరుపుకున్నారు.

పీలేరులో

వేంకటేశ్వరస్వామిని దర్శించి

పూజలు చేస్తున్న

భక్తులు

భక్తిశ్రద్ధలతో వైకుంఠ ఏకాదశి వేడుకలు

ఉత్తర ద్వార దర్శనానికి పోటెత్తిన భక్తులు

వేకువ జామునుంచే భక్తులతో

కిటకిటలాడిన వైష్ణవాలయాలు

విశేష పూజలు, అలంకారాలు, అన్నదానాలు

మదనపల్లె అర్బన, జనవరి 10(ఆంధ్రజ్యోతి): నారాయణే.. నమోస్తుతి..! అంటూ వైకుంఠ ఏకా దశి పర్వదినాన్ని ప్రజలు శుక్రవారం భక్తిశ్రద్ధలతో వైభ వంగా జరుపుకున్నారు. మదనపల్లెలో పలు ఆలయాల్లో వేకువజామున 4 గంటలకే ఆలయా ల్లో ఉత్తర ద్వార దర్శనం ద్వారా భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. దేవళం వీధిలోని ప్రస న్న వెంకటరమణ స్వామి ఆలయంలో ఆలయ ఈవో రమణ ఆధ్వర్యంలో వైకుంఠ ఏకాదశికి పెద్ద ఎత్తున వస్తున్న భక్తులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ఉదయం నుంచి రాత్రి 9 గంట ల వరకు వేల సంఖ్యలో భక్తులు స్వామివారిని ఉత్తర ద్వార దర్శనం ద్వారా దర్శించుకున్నారు. మధ్యాహ్నం స్థానిక ఎమ్మెల్యే షాజహానబాషా తన అనుచరులతో టౌనబ్యాంకు చైర్మన విద్యాసా గర్‌, షంషీర్‌, జేసీబీ వేణు, నవీనచౌదరి, శివన్న, మధు కలిసి వేంకటేశ్వర స్వామివారిని దర్శించు కున్నారు. తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరాంచినబాబు, దొరస్వామినాయుడు, తదితరు లు కలిసి ప్రసన్న వెంకటరమణ స్వామిని దర్శిం చుకున్నారు. అనపగుట్టలోని అభయ లక్ష్మీనర సింహస్వామి ఆలయంలో స్వామివారిని వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రత్యేక అర్చనలు, అభిషేకా లు, విశేష పూజలు నిర్వహించారు. గోవర్థనగిరి లో శ్రీకృష్ణాలయంలో స్వామివారికి విశేషంగా అలంకరణలు చేసి భక్తులకు దర్శనం కల్పించా రు. ఆలయకమిటీ సభ్యులతో భక్తులకు తీర్థప్రసా దాలు అన్నదానం చేశారు. వరాల ఆంజనేయస్వా మి ఆలయంలోవ స్వామివారికి ప్రత్యేకంగా అర్చ నలు, అభిషేకాలు నిర్వహించారు. ఉత్తర ద్వార నుంచి భక్తులకు దర్శనం కల్పించారు. ఆలయం లో లలిత సహస్రపారాయణం భక్తులకు అన్నదా నం చేశారు. సాయంత్రం స్వామివారిని ఊరే గింపు నిర్వహించారు.

గుర్రంకొండలో: మండలంలోని తరిగొండ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఉదయాన్నే ఆలయంలో లక్ష్మీనరసింహ స్వామివారికి అర్చ న, పంచామృతాభిషేకం, విశేష పూజలను చేసి ప్రత్యేకంగా అలంకరించి ఉత్తర ద్వార దర్శనంలో కొలువుదీర్చారు. అధిక సంఖ్యలో భక్తులు ఉత్తర ద్వార దర్శనం ద్వారా స్వామివారిని దర్శించుకుని కొబ్బరి కాయలను సమర్పించి పూజలు చేసి మొక్కులు తీర్చుకుని తీర్థప్రసాదాలను స్వీకరిం చారు. ఆలయంలో అన్నదానం నిర్వహించారు. కార్యక్రమంలో అర్చకులు గోపాల్‌భట్టర్‌, కృష్ణరా జు, కృష్ణప్రసాద్‌, అనిల్‌, గోకుల్‌, వరద, వెంకీ, ఆలయ సిబ్బంది నాగరాజు పాల్గొన్నారు.

వెల్లివిరిసిన ఆధ్యాత్మిక శోభ

పీలేరు, జనవరి 10(ఆంధ్రజ్యోతి): పవిత్రమైన వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం పీలేరు మండలంలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. వైకుంఠ ఏకాదశి పర్వదినాన శ్రీమ న్నారాయణుడిని దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయన్న తలంపుతో ప్రజలు వేకువజాము నుంచే ఆలయాలకు పోటెత్తారు. కోటపల్లెలోని పద్మావతి ఆండాళ్‌ సమేత వేంకటేశ్వర స్వామి, వేంకటాద్రి ఇండ్ల వద్దనున్న వేంకటేశ్వర స్వామి, ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్దనున్న చెన్నకేశవ స్వామి, అగ్రహారంలోని అష్టలక్ష్మీ సమేత లక్ష్మీన రసింహస్వామి ఆలయాలలో వైకుంఠ ద్వారం ఏ ర్పాటు చేసి భక్తులకు స్వామివారి దర్శనం కల్పిం చారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుం డా ఆలయ ధర్మకర్తలు జీవీ శ్రీనాథరెడ్డి, సూర్యనా రాయణ రెడ్డి, సుగుణాకర్‌, ఆలయ కమిటీ సభ్యులు ముడుపులవేముల మధుసూధన రెడ్డి, సీఆర్‌ రాజేశ, బాలం నరేంద్ర రెడ్డి, ఉమాకాంత రెడ్డి, శివ, కృష్ణారెడ్డి, నరసింహారెడ్డి, జీసీ మహేశ్వ ర రెడ్డి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.

ఆలయాలకు పోటెత్తిన భక్తులు

తంబళ్లపల్లె, జనవరి 10(ఆంధ్రజ్యోతి): వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయా లకు భక్తులు పోటెత్తారు. తంబళ్లపల్లె మండలం నుంచే కాకుండా జిల్లాలోని పలు ప్రాంతాల నుం చి భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో కోసు వారిపల్లె ప్రసన్న వెంకటరమణ స్వామి ఆల యం, తంబళ్లపల్లె మల్లయ్యకొండ మల్లికార్జున స్వామి ఆలయాలు కిటకిటలాడాయి. శుక్రవారం వేకువజాము నుంచే భక్తులు ఆలయాలకు చేరు కుని క్యూ లైన్లలో బారులు తీరి ఉత్తర ద్వార దర్శనం ద్వారా స్వామి వారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. నియోజకవర్గ టీడీపీ ప్రచార సమన్వయకర్త సీడ్‌ మల్లికార్జున నాయు డు, పార్టీ నాయకులు వైకుంఠ ద్వార దర్శనం ద్వారా స్వామి వారిని దర్శించుకున్నారు. ఆల యం వద్ద అన్నదానం చేశారు.

పెద్దతిప్పసముద్రంలో : మండలంలోని వివిధ గ్రామాల్లో వెలసిన వైష్ణవాలయాలు శుక్రవారం వైకుంఠ ఏకాదశిని పురష్కరించుకుని భక్తులతో కిటకిటలాడాయి. పీటీఎంలో వెలసిన శ్రీదేవి భూ దేవి సమేత చెన్నకేశవ స్వామి ఆలయంలో వైకుంఠ ద్వారం ద్వారా భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ, ఆలయ నిర్వా హకులచే ఉదయం నుంచి సాయంత్రం వరకు అన్నదానంతో పాటు లడ్డూ ప్రసాదాలను అందిం చారు. రంగసముద్రంలో వెలసిన చెన్నకేశవ స్వామి ఆలయం, మల్లెల గ్రామం గొందిపల్లె సమీపంలో కదిరి గుట్టపై వెలసిన కదిరి దేవుడైన నరసింహస్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి పూజలు నిర్వహించారు. పీటీఎంలో వెలసిన ప్రస న్న పార్వతీ సమేత విరూపాక్షేశ్వర స్వామి ఆల యంలో వైకుంఠ ఏకాదశిని పురష్కరించుకుని ఆధ్యాత్మికవేత్త సనగరం పట్టాబిరామయ్య ఆధ్వ ర్యంలో వేకువ జాము నుంచే ఆలయంలో రుద్రా భిషేకం, రుద్ర హోమం నిర్వహించారు.

పెద్దమండ్యంలో: మండలంలో వైకుంఠ ఏకా దశి పర్వదినాన్ని పురస్కరించుకుని పలు ఆల యాలు భక్తులతో కిటకిట లాడాయి. మండలం లోని పాపేపల్లి నరసింహాస్వామి ఆలయం, చెరువుకిందపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయాల లో ఉత్తర ద్వార దర్శనం ద్వారా భక్తులు స్వామి వారిని దర్శించుకుని పూజలు చేశారు.

రామసముద్రంలో: మండల కేంద్రంలో వెలసిన శ్రీకృష్ణదేవరాముల కాలంనాటి అతిపురాతన ప్రసిద్ధి చెందిన లక్ష్మీజనార్దనస్వామి ఆలయంలో శుక్రవారం వైకుంఠ ఏకాదశి వేడుకలు కన్నుల పండువగా నిర్వహించారు. ఈసందర్భంగా శ్రీదేవి భూదేవి సమేతంగా లక్ష్మీజనార్దనస్వామి వారికి బెంగళూరు నుంచి తెప్పించిన పలు రకాల పుష్పాలతో అలంకరణ చేశారు. మండల కేంద్రం లోని గౌనివారి కుటుంబీకులు స్వామివారి కల్యా ణోత్సవం అత్యంత వైభవంగా జరిపించారు. అలాగే చెంబకూరు, మినికి గ్రామాల్లో ఉన్న వెంక టేశ్వరస్వామి ఆలయాల్లో వైభవంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు నిర్వహించారు.

కలకడలో:వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని మండ ల ప్రజలు శుక్రవారం భక్తిశ్రద్ధలతో జరుపుకు న్నారు. గోపాలపురంలోని షిర్డిసాయిబాబా ఆల యంలో కలశస్థాపన, గోపూజలను చేశారు. కలక డలోని వేణుగోపాల స్వామి ఆలయంలో స్వామి వారు రుక్మిణి, సత్యభామ సమేతంగా భక్తులకు దర్శనమిచ్చారు. సిద్దేశ్వర ఆలయం, బాటవారిప ల్లెలోని ఆంజనేయస్వామి ఆలయం, చౌడేశ్వరి ఆలయాలు, నడిమిచెర్లలోని కోదండరామస్వామి వారిని భక్తులు దర్శించుకున్నారు.

కలికిరిలో: మండలంలోని పలు వైష్ణవాలయాల్లో శుక్రవారం వైకుంఠ ఏకాదశి పూజలు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు ఆల యాలకు పోటెత్తారు. కలికిరి లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో స్వామి వారికి ప్రత్యేక అలం కరణలు చేసి భక్తులకు దర్శనం కల్పించారు. చెక్కరవాండ్లపల్లెలో వెంకటేశ్వరస్వామి ఆలయం లో శ్రీదేవి భూదేవి సమేత స్వామి వారి దర్శనం కల్పించారు. రాత్రి గ్రామోత్సవం నిర్వహించి అన్న దానం చేశారు. గుండ్లూరు చెన్న కేశవస్వామి ఆలయంలో, గ్రామ దేవత యల్లమ్మ ఆలయంలో, పెద్దవంకపల్లె వెంకటేశ్వరస్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు.

వాల్మీకిపురంలో: వాల్మీకిపురం మండలంలోని చింతపర్తి ఓబులేషుని కొండలో వెలసిన ఓబులే శ్వరస్వామి వారి ఆలయంలో శుక్రవారం వైకుం ఠ ఏకాదశి వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఉదయం నుంచి కొండకు భక్తులు అధిక సంఖ్యలో వచ్చి ఉత్తర ద్వార దర్శనం ద్వారా స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం వైకుంఠ దర్శనం శనివారం కూడా కొనసాగను న్నట్లు ఆలయ ప్రధాన అర్చకుడు విద్యాసాగర్‌ స్వామి తెలిపారు. స్వామి మాలధారణ భక్తులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

నిమ్మనపల్లిలో: మండలంలోని వెంగంవారిపల్లి పంచాయతి బాలినాయునిపల్లిలో వెలసిన చౌడే శ్వరీదేవి ఆలయంలో వైకుంఠ ఏకాదశిని శుక్రవా రం ప్రజలు భక్తి శ్రద్ధలతో జరుపుకొన్నారు. ఉద యం నుంచి అమ్మవారికి ప్రత్యేక పూజలతో పా టు హోమాలు నిర్వహించారు. మహిళలు ప్రత్యేక పూల మాలలతో అమ్మ వారిని అలంకరిం చారు. ఆలయాని వచ్చిన భక్తులకు నిర్వాహకులు అన్నదానం ఏర్పాటు చేశారు.

బి.కొత్తకోటలో: వైకుంఠ ఏకాదశిని శుక్రవారం బి.కొత్తకోట మండలంలో భక్తిశ్రద్ధలతో నిర్వహిం చుకున్నారు. పట్టణంలోని బీసీకాలనీ వేంకటర మణస్వామి ఆలయం, దిగువబస్టాండులో ఉన్న చెన్నకేశవస్వామి ఆలయాలలో ఉదయాన్నే పె ద్దసంఖ్యలో భక్తులు ఉత్తర ద్వార దర్శనం ద్వార వెళ్లి దైవదర్శనం చేసుకున్నారు. ఈసందర్భంగా ఆలయాలు కిటకిటలాడాయి. పట్టణంలోని సా యినాథుడి ఆలయంలో శ్రీమహావిష్నువు అలంక రణ భక్తులను ఆకట్టుకుంది.

Updated Date - Jan 10 , 2025 | 11:57 PM