ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

గుర్రంకొండలో 28 మంది పింఛన్లు తనిఖీ

ABN, Publish Date - Jan 06 , 2025 | 11:46 PM

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టి న పెన్షనల తనిఖీ ప్రక్రియలో భాగంగా సోమవారం గుర్రం కొండ మండలంలో 28 పిం ఛన్లను అధికారులు తనిఖీ చే శారు.

గుండ్లగుట్టతాండాలో పెన్షనదారుల వివరాలను ఆరాతీస్తున్న తనిఖీ బృందం

గుర్రంకొండ, జనవరి 6(ఆంధ్ర జ్యోతి):రాష్ట్ర ప్రభుత్వం చేపట్టి న పెన్షనల తనిఖీ ప్రక్రియలో భాగంగా సోమవారం గుర్రం కొండ మండలంలో 28 పిం ఛన్లను అధికారులు తనిఖీ చే శారు. పక్షపాతం, కిడ్నీ రోగు లకు సంబంధించి 57 పింఛ నులు ఉండగా వారు ప్రతి నెలా రూ.15 వేలు పింఛన సొమ్ము తీసుకుంటున్నారు. ఈ క్రమంలో మొదటిరోజు టి.పసల వాండ్లపల్లె, నడిమికం డ్రిగ, చెర్లోపల్లె, గుర్రంకొండ, సరిమడుగు, ఎల్లుట్ల గ్రామాలకు చెందిన 28 మంది పెన్షనదారులను తనిఖీ బృందం పరిశీలించారు. పెన్షనదారుల స్థితిగ తులను పరిశీలించి నివేదికను ఉన్నతాదికారులకు అందజేస్తామని వైద్యులు జ్యోష్న, భాస్కర్‌రావు తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్‌ రవీంద్రనాయక్‌, ఎంపీ డీవో వెంకటేశులు, సచివాలయ సిబ్బంది ఉన్నారు.

పీలేరులో తొలిరోజు 26 పింఛన్ల విచారణ

పీలేరు, జనవరి 6(ఆంధ్రజ్యోతి): పింఛన్ల తనిఖీల్లో భాగంగా సోమవారం పీలేరు మండలంలో 26 పింఛన్ల లబ్ధిదారులను అధికారులు విచారించారు. కడప సర్వజన ఆసుపత్రికి చెందిన ఆర్థోపెడిక్‌ అసిస్టింట్‌ ప్రొఫెసర్లు డాక్టర్‌ ఆనంద్‌, డాక్టర్‌ మనోహర్‌లు పీలేరు పట్టణంలోని 26 మంది లబ్ధిదారులను విచారించారు. వారికి మండల ఈవోపీఆర్‌ఆర్‌డీ లతీఫ్‌ ఖాన, పీలేరు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ చంద్రశేఖర్‌ సహాయసహకారాలు అందిం చారు. ఈ సందర్భంగా ఈవోపీఆర్‌ఆర్‌డీ లతీఫ్‌ఖాన మాట్లాడుతూ పీలేరు మండలంలో రూ.15 వేల దివ్యాంగ పింఛన్లు తీసుకుంటున్న వారు 76 మంది ఉన్నారని, వారందరినీ వచ్చే రెండు రోజుల్లో విచారించనున్నట్లు తెలిపారు. విచారణ సారాంశాన్ని నివేదిక రూపంలో ఉన్నతాధికారులకు అందజేస్తారని వివరించారు.

పింఛన లబ్ధిదారులకు నోటీసులు జారీ

నిమ్మనపల్లి, జనవరి 6(ఆంధ్రజ్యోతి): మండలంలో రూ.15వేల పింఛన పొం దుతున్న 153మంది లబ్ధిదారులకు నోటీసులు జారీ చేస్తున్నట్లు ఎంపీడీవో పరమేశ్వర్‌రెడ్డి తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ అనర్హులు పిం ఛన పొందుతున్నారని ఫిర్యాదులు రావడంతో రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాలోని దివ్యాంగుల పింఛనల తనిఖీ చేపట్టిందన్నారు. ఇందులో భాగంగా అన్నమ య్య జిల్లాను ఫైలెట్‌ ప్రాజక్టు కింద ఎంపిక చేయడంతో ఈ నెల 17నుంచి 24వరకు రూ.15వేలు పింఛన పొందుతున్న లబ్ధిదాలను విచారించి వారి సర్థిఫికెట్లను తనిఖీ చేయనున్నట్లు తెలిపారు. కాగా విచారణ అధికారులుగా కడప డాక్టర్‌ నాగేశ్వర్‌రెడ్డి, రాయచోటి నుంచి డాక్టర్‌ రామరాజులులతో పాటు ఇతర సిబ్బంది పాల్గొంటారని తెలిపారు. దీని కొరకు 15వేలు పింఛనదారులు ఇళ్ల వద్దే ఉండి వారికి సహకరించాలని ఆయన కోరారు.

Updated Date - Jan 06 , 2025 | 11:46 PM