ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

భూముల రీసర్వేలో సమస్యలు తలెత్తకుండా చూడాలి

ABN, Publish Date - Apr 28 , 2025 | 11:46 PM

భూముల రీ సర్వేలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూడాలని జమ్మలమడుగు ఆర్డీవో సాయిశ్రీ సర్వేయర్లను ఆదేశించారు.

సర్వేయర్ల సమావేశంలో మాట్లాడుతున్న ఆర్డీవో సాయిశ్రీ

జమ్మలమడుగు, ఏప్రిల్‌ 28(ఆంధ్రజ్యోతి): భూముల రీ సర్వేలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూడాలని జమ్మలమడుగు ఆర్డీవో సాయిశ్రీ సర్వేయర్లను ఆదేశించారు. స్థాని క ఆర్డీవో కార్యాలయ సభాభవనంలో సోమవారం సాయంత్రం డివిజన్‌స్థాయిలోని సర్వేయర్లకు రీ సర్వేపై వర్క్‌షాపు నిర్వహించారు. ఈ సమావేశంలో ఆర్డీవో సాయిశ్రీ ఒక్కో మండలంలో సర్వేయర్లను సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఏయే గ్రామాల్లో రీ సర్వేకు సంబందించి సమస్యలు, భూములకు సంబందించిన రైతాంగ ఇబ్బందులు ఉన్నాయో అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రీ సర్వేలో ఇబ్బందులను ఆయా గ్రామాల, మండలాల సర్వేయర్లు ఆర్డీవో దృష్టికి సమస్యను తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ ఎప్పటికప్పుడు ఇబ్బందులను తెలియజేయాలని సమస్యలు లేకుండా రీ సర్వే కొనసాగాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్‌స్థాయిలోని సర్వేయర్లు పాల్గొన్నారు.

Updated Date - Apr 28 , 2025 | 11:46 PM