విజయదుర్గాదేవి సన్నిధిలో రాహుకాల పూజలు
ABN, Publish Date - Jan 07 , 2025 | 11:34 PM
కడప నగరం విజయదుర్గాదేవి సన్నిధిలో మహిళలు మంగళవారం భక్తిశ్రద్ధలతో రాహుకాల పూజలు చేశారు.
కడప కల్చరల్, జనవరి 7 (ఆంధ్రజ్యోతి): కడప నగరం విజయదుర్గాదేవి సన్నిధిలో మహిళలు మంగళవారం భక్తిశ్రద్ధలతో రాహుకాల పూజలు చేశారు. వేకువజామునే పంచామృత అభిషేకం చేశారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 4.30 వరకు రాహుకాల పూజలు నిర్వహించారు. ఈనెల 12న రెండవ ఆదివారం సందర్భంగా విజయదుర్గా సమేత మల్లికార్జున స్వామివారి శాంతి కళ్యాణం, 13న సోమవారం పౌర్ణమి సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక అభిషేకం, చండీహోమం జరుగనున్నట్లు ఆలయ వ్యవస్థాపకుడు మల్లికార్జునరావు, నిర్వాహకుడు దుర్గాప్రసాద్ తెలిపారు.
Updated Date - Jan 07 , 2025 | 11:35 PM