ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పీహెచసీలలో మందుల కొరత

ABN, Publish Date - Jan 11 , 2025 | 11:22 PM

ప్రభుత్వాసుపత్రుల్లో మౌలిక వసతుల కల్పనతో పాటు మందుల కొరత వేధిస్తోంది.

పెద్దతిప్పసముద్రం ఆరోగ్య కేంద్రం

పట్టించుకోని ఆసుపత్రి అభివృద్ధి కమిటీలు

మందుల కొనుగోలు, వసతులకు

నిధులున్నా ఆసుపత్రులకు చేరని దుస్థితి

అభివృద్ధ్ది కమిటీల సమావేశాలు జరగక

పోవడమే కారణమంటున్న వైనం

పెద్దతిప్పసముద్రం జనవరి 11 (ఆంద్రజ్యోతి ) : ప్రభుత్వాసుపత్రుల్లో మౌలిక వసతుల కల్పనతో పాటు మందుల కొరత వేధిస్తోంది. నిబందనల మేరకు ఆయా ప్రభుత్వ ఆసుపత్రుల్లో అభివృద్ధి కమిటీలు ప్రతి మూడు నెలలకు ఒకసారి సమావేశాలు నిర్వహించి ఆసుపత్రుల్లో మందు ల కొనుగోలు, కనీస సౌకర్యాల కోసం ఆసుపత్రి కమిటీ చైర్మన్లు ఆమోదం తెలపాల్సి ఉంటుంది. తంబళ్లపల్లె నియోజకవర్గంలోనే అతి పెద్ద మం డలంగా పెద్దతిప్పసముద్రం విస్తరించింది. ఈ మండలంలో రెండు పీహెచసీలు ఉన్నాయి. ఒకటి స్థానిక పీటీఎంలోను మరొకటి కందుకూ రు గ్రామంలో ఉన్నాయి. కందుకూరులో ఉన్న పీహెచసీ కిందకు 6 సచివాలయాలు, పెద్దతిప్ప సముద్రం పీహెచసీ కిందకు 9 సచివాలయా లతో పాటుగా బి.కొత్తకోట మండలంలోని 15 సచివాలయాలను ఇందులో విలీనం చేశారు.

ఊసేలేని కమిటీ సమావేశాలు

ఆయా ఆసుపత్రుల్లో ప్రతి మూడు నెలలకు ఒక సారి కమిటీ సమావేశాలు జరపాలి. అయితే గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆసుపత్రి కమిటీ సమావేశాలు జరిపిన దాఖలాలే లేవు. దీంతో ఆసుపత్రుల్లో సరిపడా మందులు అందు బాటులో లేకపోవడంతో ఆసుపత్రులకు వచ్చే రోగులు ఇబ్బందులు పడుతున్నారు. దీనికి తోడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలు గడుస్తున్నా ఆసుపత్రుల్లో గత వైసీపీ ప్రభుత్వం నియమించిన కమిటీలే కొనసాగు తుండడంతో ఆసుపత్రుల్లో నెలకొన్న సమస్యలపై పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతు న్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలు గడుస్తున్నా కనీసం ఒక్క సారైనా ఆసుపత్రి కమిటీ సమావేశాలు నిర్వహించి తీర్మానాలు చేయకపోవడంతో ప్రభుత్వాసుపత్రు లకు సరిపడా నిధులు మంజూరు కావడం లేద నే విమర్శలున్నాయి. దీంతో ఆసుపత్రుల్లో సమ స్యలు పరిష్కారం కావడం లేదని వెద్యాధికారు లు చెబుతున్నారు. కాగా గత వైసీపీ హయాంలో ఆసుపత్రుల అభివృద్ధికి నిధులు మంజూరైనా కనీస సౌకర్యాలు కల్పించకుండా చేసిన పనులకే మళ్లీ మళ్లీ బిల్లులు పెట్టుకుని మమా అనిపించా రు. ప్రశ్నిస్తే అప్పట్లో కేసులు పెడతారని భయపడి అందరూ మిన్నకుండిపో యారు.

కమిటీలు ఇలా....

ఆయా ఆసుపత్రి కమిటీల్లో చైర్మనగా స్థానిక ఎంపీపీ, ఎంపీడీవో, మెడికల్‌ ఆఫీసర్‌, స్థానిక సర్పంచలు కమిటీ మెంబర్లుగా ఉంటారు. సమా వేశాలను ప్రతి మూడు నెలలకు ఒక్కసారి నిర్వ హించి తీర్మానం చేసుకుని మంజూరైన నిధుల తో ఆసుపత్రుల్లో కనీస సౌకర్యాలు కల్పించాలి. అయితే ఉన్న కమిటీలు పట్టించుకోకపోవడంతో ఆయా ఆసుపత్రుల్లో సౌకర్యాలు కరువయ్యాయి.

కూటమి ప్రభుత్వం ప్రభుత్వాసుపత్రులపై దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.

ఉన్న నిధులతో చిన్న చిన్న పనులు చేశాం

పెద్దతిప్పసముద్రం ఆసుపత్రికి గతంలో రూ.5 లక్షలు నిధులు రాగా వాటితో చిన్న చిన్న మర మ్మతు పనులు చేపట్టినట్లు ఆస్పత్రి మెడికల్‌ ఆఫీసర్‌ పురుషోత్తం నాయక్‌ తెలిపారు. తమ పరిధిలో రోగులకుమెరుగైన వెద్యం అందించ డమే ధ్యేయంగా పనిచేస్తున్నామని తెలిపారు.

Updated Date - Jan 11 , 2025 | 11:22 PM