పాడి రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
ABN, Publish Date - Jan 10 , 2025 | 11:59 PM
రాష్ట్రంలో పాడి రైతుల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభు త్వం పనిచేస్తోందని ఎమ్మెల్యే షాజ హానబాషా పేర్కొన్నారు.
మదనపల్లె టౌన, జనవరి 10(ఆంధ్ర జ్యోతి): రాష్ట్రంలో పాడి రైతుల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభు త్వం పనిచేస్తోందని ఎమ్మెల్యే షాజ హానబాషా పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని బొమ్మనచెరువు పం చాయతీ మందబండలో రూ.2.30 లక్షలతో నిర్మించిన మినీగోకులాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో 75 మినీ గోకులాల నిర్మాణాలకు ప్రభుత్వం రూ.1.63 కోట్ల నిధులు మంజూరు చేసిందన్నారు. ఈ మొత్తం పాడి రైతులకు సబ్సిడీగా అందిస్తోందన్నారు. వీటికి తోడు పశుగ్రాసం కొరత లేకుండా రూ.1.07 కోట్లతో పశుగ్రాసం పెంపకానికి ఉపాధి హామీ పథకం కింద నిధులు విడు దల చేయనుందన్నారు. కార్యక్రమంలో డ్వామా ఏపీడీ మధుబాబు, ఎంపీ డీవో తాజ్‌మస్రూర్, పశుసంవర్థకశాఖ ఏడీ డాక్టర్ రోహిణి, పశువైద్యాధికారులు డాక్టర్ షరన లారెన్స, ప్రసాద్‌రెడ్డి, ఏపీవో సుబ్రమణ్యం, వీఆర్‌వో సౌజన్య, టీడీపీ నాయకు లు ముద్దుకృష్ణమనాయుడు, రఘుపతి, నందకుమార్, నరేంద్ర పాల్గొన్నారు.
ములకలచెరువులో: కూటమి ప్రభు త్వం అమలు చేస్తున్న మినీ గోకులాల షెడ్ల నిర్మాణాలు పాడి రైతులకు వరం లాంటిదని తంబళ్లపల్లె నియోజకవర్గ ప్రచార సమన్వయకర్త సీడు మల్లికా ర్జుననాయుడు, టీడీపీ నేత మంత్రి గిరిధర్‌రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని గూడుపల్లె పంచాయతీ కోటపల్లెలో నిర్మించిన మినీ గోకులం షెడ్డును వారు ప్రారంభించారు. ఈ షెడ్డు నిర్మానానికి ప్రభుత్వం పాడి రైతులకు రూ.రూ.2.36లక్షలు అందిస్తోందన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో హరినారాయణ, టీడీపీ రాష్ట్ర బీసీ సెల్ అధికార ప్రతినిధి గుత్తికొండ త్యాగరాజు, జిల్లా కార్యదర్శి యర్రగుడి సురేష్, మార్కెట్ కమిటీ మాజీ వైస్ ఛైర్మన కేవీ రమణ, కురబలకోట మండల అధ్యక్షుడు వైజీ సురేంద్రయాదవ్ పాల్గొన్నారు.
గుర్రంకొండలో:గోకులాలను త్వరితిగతిన పూర్తి చేయాలని ఎంపీడీవో వెంకటేశులు లబ్ధిదారులకు సూచించారు. మండలంలోని ఎల్లుట్ల పంచాయితీ నల్లగుట్టపల్లెలో శుక్రవారం గోకులం షెడ్‌ను ఆయన ప్రారంభించి మాట్లాడుతూ గోకులాలు మంజూరైన లబ్ధిదారులు సకాలంలో బిల్లులు మంజూరు చేయిస్తామన్నారు. కార్యక్ర మంలో టీడీపీ నాయకులు జగదీష్, చలమారెడ్డి, ఎల్లుట్ల మురళీ, శ్రీనివాసులు, రామయ్య, మల్లయ్య, సిద్దయ్య, రవి, కిరణ్‌లు పాల్గొన్నారు.
Updated Date - Jan 10 , 2025 | 11:59 PM