నిధులున్నా..సాగని పనులు
ABN, Publish Date - Jan 06 , 2025 | 11:41 PM
పీటీ ఎం మండలంలోని గ్రామ పంచాయతీలకు రాజ కీయగ్రహణం పట్టుకుంది.
పీటీఎంలో కుంటుపడుతున్న అభివృద్ధి అధిక పంచాయతీల్లో సర్పంచల నిర్లిప్తత వర్గపోరుతోనే సమస్యలంటున్న జనం
పెద్దతిప్పసముద్రం జనవరి6 (ఆంద్రజ్యోతి):పీటీ ఎం మండలంలోని గ్రామ పంచాయతీలకు రాజ కీయగ్రహణం పట్టుకుంది. దీంతో కేంద్ర ప్రభు త్వం మంజూరు చేసిన ఆర్థిక సంఘం నిఽధులు పంచాయతీలలో మూలుగుతున్నా అభివృద్ధి పను లు మాత్రం ముందుకు సాగడంలేదు. పీటీఎం మండలంలో 20 పంచాయతీలు ఉండ గా కేంద్ర ప్రభుత్వం జనాభా ప్రాతిపదికన ఆర్థిక సంఘం నిధులను మౌలిక వసతులు కల్పించేందుకు కేటాయించినా వాటిని చాలా పంచాయతీల్లో అభివృద్ధికి వినియోగించుకోకపో వడంతో గ్రామాల అభివృద్ది కుంటుపడుతోంది. పీటీఎం మండలంలోని అత్యధిక గ్రామ పంచా యతీలు వైసీపీ సర్పంచల ఆధ్వర్యంలో ఉం డడం ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధికారం లోకి రావడంతో కేవలం వర్గపోరుతోనే ప్రజాప్రతి నిధులు నిర్లక్ష్యం చేస్తూ అభివృద్ధిని విస్మరిస్తు న్నారని ఆయా గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని వివిధ పంచా యతీల్లో మూలుగు తున్న ఆర్థిక సంఘం నిధు లు ఇలాఉన్నాయి. మండలంలోని అంకిరెడ్డిపల్లె గ్రామానికి 2020- 24 సంవత్సరానికి 60 పనులు చేపట్టేందుకు రూ .19 లక్షల 85 వేల 169 గాను ఒక్క పని మాత్రమే జరుగుతోంది. ఇందుకు రూ 1లక్ష 60 వేలు మాత్రమే ఖర్చు చేయగా ఆ పని ఇంకా పూర్తి కాలేదు. అంకిరెడ్డిపల్లె పంచాయతీకి జనరల్ ఫండ్ రూ. 2లక్షల 61వేల 513 ఉంటే దీన్ని మొత్తం ఖర్చు చేశారు. బూర్లపల్లెలో జన రల్ ఫండ్ రూ.19 లక్షల60 వేల 337లు కాగా రూ.3లక్షల 24వేలు ఖర్చు చేశారు. మిగతా నిధులు అలాగే ఉన్నాయి. ఇక 14వ ఆర్థి సం ఘం నిధులు రూ 13 లక్షల 93వేల 659లలో ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. ఇక పంచాయతీకి ఆదాయం రూ.31 వేల 701 రాగా ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. ఈ పంచాయతీకి 13వ ఆర్థిక సంఘం నిధులు 25 రూపాయలు మాత్రమే వచ్చాయి బూచిపల్లె గ్రామానికి 14వ ఆర్థిక సంఘం నిధుల్లో రూ 4లక్షల 39వేల 601, జనరల్ పండ్ రూపంలో రూ.15 వేల 308రాగా వాటిని వినియోగించ లేదు. దేవప్ప కోట పంచాయతీ గత ప్రభుత్వం లో నూతనంగా ఏర్పడింది. ఈ పంచాయతీలో టీడీపీ మద్దతుదారుడు సర్పంచ కావడంతో అప్పటి ప్రభుత్వం చిన్నచూపు చూసి నిదులు మంజూరు కాకుండా చేశారు. జనరల్ పండ్ రూ 35 వేల 269 లు కాగా రూ. 23వేల 313లు మాత్రమే ఖర్చు చేశారు. ఈ పంచాయతీకి ఆర్థిక సంఘం నిధులు మంజూరు కాలేదు. కమ్మచెరువు పంచాయతీ కూడా నూతనంగా ఏర్పడింది. ఈ పంచాయతీలో జనరల్ ఫండ్ రూ 92వేల 978లు ఉండగా ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. ఆర్థిక సంఘం నిధులు మంజూరు కాలేదు. కందుకూరు గ్రామంలో జన రల్ ఫండ్ రూ. 2లక్షల5వేల 70 ఉండగా లక్షా 84వేల 8వందలు ఖర్చు చేశా రు. 14వ ఆర్థిక సంఘం నిధులు రూ.26 లక్షల 88వేల 792 లు రాగా ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. 13వ ఆర్థిక సంఘం నిధులు రూ.1,113 రాగా ఇవి ఖర్చు చేయలేదు. కాట్నగల్లు గ్రామంలో జనరల్ ఫండ్ రూ.15వేల 678లు ఉండగా ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. 13వ ఆర్థిక సంఘం నిధులు రూ.1 657 రాగా ఒక్క రూపాయి ఖర్చు చేయలేదు. మద్దయ్యగారిపల్లె లో జనరల్ ఫండ్ రూ.33వేల 569 ఉండగా మొత్తం ఖర్చు చేశారు.14వ ఆర్థిక సంఘం నిధులు రూ.15లక్షల 20వేల 677 రాగా ఒక్క రూపాయి ఖర్చు చేయలేదు. మడుమూరులో 14వ ఆర్థిక సంఘం నిధులు రూ.13 లక్షల63వేల 343లు రాగా ఒక్క రూపాయి ఖర్చు చేయలేదు. జనరల్ ఫండ్ రూ.ఒకలక్షా 68వేల 455 ఖర్చు చేశారు. మల్లెల గ్రామంలో జనరల్ ఫండ్ రూ. ఒకలక్షా19వేలు కాగా రూ.96వేల 865 ఖర్చు చేశారు. ఇక 14వ ఆర్థికసంఘం నిధులు రూ 18 లక్షల80 వేల 712లు రాగా ఇందులో ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. నవాబు కోట గ్రామ పంచాయతీ నూతనంగా ఏర్పాటైం ది. దీనికి జనరల్ ఫండ్ కింద రూ.48వేల 218 లు కాగా రూ.31 వేలు ఖర్చు చేశారు. దీనికి ఆర్థిక సంఘం నిధులు రాలేదు. పట్టెంవాండ్లప ల్లెలో జనరల్ ఫండ్ రూ.39 వేల 203 లు ఉండగా రూ. 13వేల 884 ఖర్చు చేశారు మిగతా డబ్బులు అలాగే ఉన్నాయి. ఇక 14వ ఆర్థిక సంఘం నిధులు రూ.8 లక్షల 81 వేల రాగా ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. ఇక స్టేట్ పైనాన్స నుంచి కేవలం 43 రూపాయలు మాత్రమే వచ్చాయి. మండల కేంద్రమైన పీటీ ఎంకు వెనుకబడిన ప్రాంతం నిధులు రూ 14వేల 615 రాగా ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. 14వ ఆర్థిక సంఘం నిధులు రూ. 30 లక్షల 38 వేలు రాగా ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. జనరల్ ఫండ్ కింద ఉన్న రూ 7లక్షల 64వేల 591 ఉండగా రూ. 7 లక్షల 26 వేల 791లు ఖర్చు చేశారు. పోతు పేట పంచాయతీ నూతనంగా ఏర్పడింది. ఈ గ్రామా నికి తెలుగుదేశం మద్దతుదారు సర్పంచగా కొన సాగుతుండగా ఈ పంచాయతీకి కనీసం సర్పం చ కూర్చునేందుకు కుర్చీ కూడా లేదు. ఈ పం చాయతీకి జనరల్ ఫండ్ కింద రూ. 90వేల 618లు ఉండగా మొత్తం ఖర్చు చేశారు. ఆర్థిక సంఘం నిధులు ఈ పంచాయతీకి మంజూరు కాలేదు. పులికల్లులో వెనుక బడ్డ ప్రాంతం నిధుల కింద రూ.60వేలు ఉండగా ఒక్క రూపా యి కూడా ఖర్చు చేయ లేదు. జనరల్ ఫండ్ కింద ఉన్న రూ.52వేల 292లో రూ 26వేల 7వందలు ఖర్చు చేశారు. రంగసముద్రంలో వెనుకబడ్డ ప్రాంతం నిధుల కింద రూ. 33వేల 658లు రాగా ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. జనరల్ ఫండ్ కింద ఉన్న రూ 96వేల 737 ఉండగా ఇందులో రూ 74వేల 582లు మాత్రమే ఖర్చు చేశారు. రాపూ రివాం డ్లపల్లె గ్రామంలో వెనుకబడ్డ ప్రాంతం నిధులు రూ. 86వేలు రాగా ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. జనరల్ ఫండ్ రూ. ఒకలక్షా 63వేల 520లు ఉండగా ఇందులో రూ ఒకలక్షా44వేల 813లు ఖర్చు పెట్టారు. సంపతికో ట గ్రామంలో జనరల్ ఫండ్ 47వేల 476 కాగా రూ. 46వేల 638 ఖర్చు చేశారు.14వ ఆర్థిక సం ఘం నిధులు రూ 9 లక్షల 96 వేలు రాగా ఇం దులో ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. తుమ్మరకుంట గ్రామంలో జనరల్ ఫండ్ రూ 63వేల708లు కాగారూ 63 వేలు ఖర్చు చేయగా రూ.708లు మాత్రం మిగిలింది. టి.సదుం లో జనరల్ ఫండ్ రూ.ఒకలక్షా16వేల 860లు కాగా రూ. 79వేల 5వందలు ఖర్చు చేశారు.
వర్గాలతో కుంటుపడుతున్న అభివృద్ధి
మండలంలో అధిక పంచాయతీల్లో వైసీపీ మద్ద తుదారులు సర్పంచలుగా ఉండడం తంబళ్లప ల్లె నియోజకవర్గం ఎమ్మెల్యే కూడా వైసీపీ కావ డంతో అభివృద్ధి కుంటుపడుతోంది. నిధులు న్నా అభివృదికి సహకరించక పోవడంతోనే సమస్యల కలుగుతోందని ప్రజలు ఆరోపిస్తున్నారు.
సిబ్బందిలేమితోనే ఇబ్బంది కలుగుతోంది
గ్రామ పంచాయతీల్లో సిబ్బంది కొరతతోనే అభివృద్ధికి ఇబ్బంది కలుగుతోంది. త్వరలో పంచాయతీల అభివృద్ధిపై దృష్టి సారిస్తాం.
-అబ్దుల్ కలాంఆజాద్, ఎంపీడీవో, పీటీఎం
Updated Date - Jan 06 , 2025 | 11:41 PM