ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

డీకేటీ భూములు కబ్జా చేసిన వైసీపీ

ABN, Publish Date - Jan 03 , 2025 | 11:38 PM

తంబళ్లపల్లె నియోజకవర్గంలో గడచిన ఐదేళ్లలో వందల ఎకరాల డీకేటీ భూముల ను వైసీపీ నాయకులు కబ్జా చేశారని, నియోజకవర్గ టీడీపీ నేత జయచంద్రా రెడ్డి ధ్వజమెత్తారు.

మాట్లాడుతున్న జయచంద్రారెడ్డి

టీడీపీ నేత జయచంద్రారెడ్డి ధ్వజం

బి.కొత్తకోట, జనవరి 3(ఆంధ్రజ్యోతి): తంబళ్లపల్లె నియోజకవర్గంలో గడచిన ఐదేళ్లలో వందల ఎకరాల డీకేటీ భూముల ను వైసీపీ నాయకులు కబ్జా చేశారని, నియోజకవర్గ టీడీపీ నేత జయచంద్రా రెడ్డి ధ్వజమెత్తారు. శుక్రవారం మండలం లోని కోటావూరులో జరిగిన రెవెన్యూ సదస్సులో ఆయన మాట్లాడుతూ జిల్లాలో పరిశ్రమలు లేని నియోజకవర్గం ఏదైనా ఉందా అంటే అది తంబళ్లపల్లే అని అన్నారు. భూ సమస్యల గుర్తింపు, వాటి పరిష్కారం కోసమే కూటమి ప్రభుత్వం రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తోందన్నారు. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పర్వీనతాజ్‌ మాట్లాడుతూ వైసీపీ నాయకులు చేసిన దాష్టీకాలను రెవెన్యూ సదస్సుద్వారా ప్రజలు బయటపెట్టాలని రైతులకు పిలుపునిచ్చారు. ఈ సందర్బంగా వివిధ భూసమస్యలపై 22 అర్జీలు అందజేశారు. కార్యక్రమంలో తహశీల్దార్‌ మహమ్మ ద్‌అన్సారీ, మాజీ సర్పంచ జయచంద్రారెడ్డి, సుదర్శనరెడ్డి, మదన మోహనరెడ్డి, చిటికి శివారెడ్డి, మొటుకుశివ, రఘునాథ్‌రెడ్డి, రవికుమార్‌, వెంకటేష్‌ పాల్గొన్నారు.

దేవాలయ భూములు ఆక్రమిస్తే చర్యలు

వాల్మీకిపురం, జనవరి 3(ఆంధ్రజ్యోతి): దేవదాయ శాఖకు సంబంధించి ఎక్క డైనా ఆలయ భూములను ఆక్రమించి నట్లు తెలిస్తే చర్యలు తప్పవని జిల్లా దేవదాయ శాఖాధికారి విశ్వనాథ్‌ పేర్కొ న్నారు. శుక్రవారం వాల్మీకిపురం మండ లంలోని జర్రావారిపల్లె గ్రామంలో రెవె న్యూ సదస్సుకు హాజరైన ఆయన మాట్లా డుతూ ఆలయ భూముల ఆక్రమణదా రులను చట్టప్రకారం నోటీసులు ఇచ్చి నిబంధనల మేరకు ఆక్రమణలు తొలగించే దిశగా చర్యలు తీసుకుంటామన్నారు. పలు చోట్ల దేవాలయ భూములను అనుభవి స్తూ కౌలు చెల్లించకుండా ఉన్న వారిపై విచారణ జరిపి సంబంధిత రైతులు దేవా లయాలకు కౌలు చెల్లించేలా చూస్తామన్నారు. అనంతరం గ్రామ పంచాయతీ పరిధిలో భూ సమస్యలు, వ్యవసాయ భూములకు రైతులు ఎదుర్కొంటున్న దారి సమస్యలపై వినతులు స్వీకరించి పలు సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. ఈకార్యక్రమంలో తహసీల్దార్‌ పామిలేటి, స్పెషలాఫీసర్‌ లక్ష్మీప్రసన్న, రాష్ట్ర కురబ కార్పొరేషన డైరెక్టర్‌ వల్లిగట్ల వెంకటరమణ, జడ్పీటీసీ నిర్మల, సర్పంచ మునిభాస్కర్‌, రెవెన్యూ ఇనస్పెక్టర్‌ సుగుణ, సర్వేయర్‌ పూర్ణచంద్ర, వివిధశాఖల అధికారులు, రెవెన్యూ సిబ్బంది, కూటమి పార్టీల నాయకులు, రైతులు పాల్గొన్నారు.

మదనపల్లె టౌనలో: మండలంలోని కోళ్లబైలు-1, కోళ్లబైలు-2 గ్రామ పంచాయతీల్లో రెవెన్యూ సదస్సులో పాల్గొన్న ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ పాలనలో నిరుపేదలకు 2 సెంట్ల ఇంటి స్థలం కేటాయిస్తున్నామన్నారు. రెవెన్యూ, పంచాయతీ అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరించాలని సూచిం చారు. డిప్యూటీ కలెక్టర్‌ రాఘవేంద్ర, డీఎల్‌డీవో అమరనాథరెడ్డి, తహసీల్దార్‌ ఖాజాభీ, ఆర్‌ఐ శేషాద్రిరావు , టీడీపీ నేత రాటకొండ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 03 , 2025 | 11:38 PM