కోఢీ
ABN, Publish Date - Jan 14 , 2025 | 12:35 AM
సంక్రాంతి పండుగ వేళ పందెం పుంజులు కత్తికట్టి మరీ బరిలోకి దిగాయి. వేలాది మంది పందెం రాయుళ్ల సమక్షంలో తెగ చెలరేగి పోయాయి. పోలీసుల ముందస్తు హెచ్చరికలు బేఖాతరయ్యాయి.
ఊరూవాడా బరులు.. కత్తులు దూసిన కోళ్లు
చెలరేగిపోయిన కోడి పందెంరాయుళ్లు
తొలిరోజే చేతులు మారిన లక్షలు
బరుల వద్దే పేకాట, గుండాట
బెట్టింగ్‌రాయుళ్లనుఆకర్షించేలా ఖరీదైన బహుమతులు
(ఏలూరు–ఆంధ్రజ్యోతి ప్రతినిధి) :
సంక్రాంతి పండుగ వేళ పందెం పుంజులు కత్తికట్టి మరీ బరిలోకి దిగాయి. వేలాది మంది పందెం రాయుళ్ల సమక్షంలో తెగ చెలరేగి పోయాయి. పోలీసుల ముందస్తు హెచ్చరికలు బేఖాతరయ్యాయి. ఎక్కడికక్కడ కోడి పందేలు, సమాంతరంగా గుండాట, పేకాట జోరుగా సాగాయి. జిల్లాలోని అన్ని ప్రాంతాల్లోను భోగి పండుగ నాడే పందేలతో దద్దరిల్లేలా చేశారు.
సంక్రాంతి అంటేనే సంప్రదాయం. కాని సమాంతరంగా కోడి పందేలు, పేకాట, గుండాట వంటి జూదాలు తెర మీదకు వచ్చాయి. ఈ ఏడాదీ ముందుగా ఊహించినట్టే ఊరూవాడా పెద్ద సంఖ్యలో కోడి పందేల బరులు వెలిశాయి. అన్ని పార్టీల నేతలు వీటికి నేతృత్వం వహించా రు. ఇంతకుముందు కోడి పందేలన్నీ వైసీపీ నేతల కనుసన్నల్లోనే ఏకపక్షంగా సాగా యి. ఈసారి కూటమి పక్ష నేతలతో పాటు మిగతా పార్టీ నేతలు ఎక్కడికక్క డ కోడి పందేల బరులు నిర్వహణకు ముందుకు వచ్చారు. కోడి పందేలు వేయరాదని, పేకాట, జూదం సహించబో మని పోలీసులు వార్నింగ్ ఇచ్చినా బేఖాతర్ చేశారు. భోగి పండుగ రోజు సోమవారం ఉదయం 11 గంటలకే దాదాపు జిల్లా అంతటా బరుల్లో పందెం కోళ్ళు తలపడ్డాయి. ఎక్కడికక్కడ పేకాట, గుండాట శిబిరాలు వెలిశాయి. ఏలూరు నగరంలోను కోడి పందేలు సాగాయి. గతంలో ఏలూరు శివారు బరుల్లో రూ.50 వేల నుంచి రూ.రెండు లక్షల వరకు పందేలు సాగగా, ఈసారి అది రూ.మూడున్నర లక్షల వరకు పెరిగింది. హైదరాబాద్ తదితర ఇతర ప్రాం తాల నుంచి కోడి పందేలపై ఆసక్తితో వచ్చిన వారంతా పందెం గెలిచేందుకు నోట్ల కట్టలను విసిరారు. జిల్లా వ్యాప్తంగా నూజివీడు, కైక లూరు, ఏలూరు, దెందులూరు, చింతలపూడి, పోలవరం, ఉంగుటూరు వంటి నియోజక వర్గాలన్నింటిలో పందేలు జోరుగా సాగాయి. పందేల్లో చనిపోయిన పందెం కోడి కోజా ఏలూరు సమీపంలోని పందెం బరుల్లో రికార్డు స్థాయిలో రూ.ఆరు వేల నుంచి రూ.15 వేల వరకు ఒక్కొ పుంజు అమ్ముడుపోయింది. ద్వారకాతిరుమల మండలంలో ఒక్కో కోజా రూ. 3000 నుంచి రూ.5000 వరకు పలికింది. దెందులూరు నియోజకవర్గంలో జరిగిన కోడి పందేలే ఈసారి హైలెట్‌గా నిలిచాయి. ఎక్కడా తేడా జరగకుండా పాస్‌లు ఇచ్చి మరీ ప్రజలను, అతిథులను బరిలోకి పంపారు. అక్కడే వారందరికీ ఆహార ఏర్పాట్లు చేశారు.
నేతల చేతుల మీదుగా ప్రారంభం
కోడి పందేలను ఎక్కడికక్కడ స్థానిక ఎమ్మెల్యేల చేతుల మీదుగానే ప్రారంభించారు. పోలవరం నియోజకవర్గంలో పలు చోట్ల పందేలను ఎమ్మెల్యే చిర్రి బాలరాజు దగ్గరుండి మరీ ప్రారంభించారు. మిగతా ఎమ్మెల్యేలంతా ఎక్కడికక్కడ పందేల వీక్షణకు తరలి వెళ్ళారు. మాదేపల్లి, రామానుజపురంల్లో జరిగిన సంక్రాంతి సంబరాల్లో ఎంపీ మహేశ్ పాలు పంచుకున్నారు.
పేకాట.. గుండాటలతో కవ్వింపు
పందేల బరుల వద్ద గుండాట, పేకాట శిబిరాలు వెలిశాయి. కోసాట(పేకాట) వైపే అత్యధికులు మొగ్గు చూపారు. ప్రతి పందెం బరిలోను లక్షల రూపాయలు చేతులు మారా యి. ప్రత్యేకించి ఇది తొలి రోజు ఇంకా రెండు రోజులు మిగిలే ఉన్నాయంటూ జూదరులు తెగ రెచ్చిపోయారు. కోసాటల్లో ఒక్క రౌండ్‌లోనే రూ.70 వేల నుంచి రూ.మూడు లక్షల వరకు పందేలకు దిగారు. గుండాట శిబిరాల్లో కుర్ర కారు జోష్ అంతాఇంతా కాదు.
ఎక్కడ పోలీసులు అక్కడ గప్‌చిప్..
ఏలూరు క్రైం : జిల్లాలో ఈ ఏడాది కోడి పందేలు నిర్వహిస్తే రౌడీ షీట్లు ఓపెన్ చేస్తా మని గత ఇరవై రోజుల నుంచి జిల్లా పోలీస్ శాఖ హెచ్చరించింది. పందేల నియంత్ర ణకు ఒ రెవెన్యూ, పోలీస్ యంత్రాంగంతో పాటు స్వచ్ఛంద సేవా సంస్ధల ప్రతినిధులతో ఒక కమి టీని ఏర్పాటు చేశారు. అయితే భోగి రోజు సోమవారం జిల్లావ్యాప్తంగా యథేచ్ఛగా పందే లు సాగాయి. ఉదయం 9 గంటల నుంచి జిల్లా లోని పోలీస్ స్టేషన్లలో పోలీసులు ఒకరో ఇద్దరో మినహా ఎవ్వరు కనిపించలేదు. అంతా విధుల్లో ఉన్నారంటూ చెప్పుకోవడం విశేషం. మరో వైపు పోలీస్ సిబ్బంది, అధికారులు కుటుంబ సభ్యులతో సంతోషంగా పండు గ జరుపు కోండి అనే సంకేతం పోలీసు శా ఖకు అంది న ట్టు తెలుస్తోంది. జిల్లాలో 25 ఏళ్లుగా పరిశీ లిస్తే ఇద్దరు ఎస్పీలే పందేలను నియంత్రించ గలిగారు. 2001లో అప్పటి ఎస్పీ అభయ త్రిపా ఠి ఉజేలా, 2005లో ఎస్పీ నర సింహమూర్తి పందేలను నియంత్రించగలిగారు.
పూటుగా తాగి.. ఫుల్లుగా భోంచేసి
సంక్రాంతి పండుగలో భాగమైన భోగినాడు మద్యం, మాంసంకు కొందరు దూరంగా ఉంటారు. ఈసారి మాత్రం కోడి పందేల్లో నిర్వాహకులే పెద్ద ఎత్తున బిర్యానీ పాయింట్లు తెరిచారు. దీంతో పాటు మద్యం విక్రయాలు ఎడాపెడా సాగాయి. కొందరేమో మద్యం దుకాణాల నుంచి కొనితెచ్చుకోగా, కొందరు చాట ుమాటుగా అమ్ముతున్న కొందరి నుంచి అత్యధిక ధరకు కొనుగోలు చేసి మరీ తాగేశారు. చికెన్ పకోడి కోసం జనం ఎగబడ్డారు. కొయ్యలగూడెం మండలం బయ్యన్నగూడెం పందేల్లో స్వల్ప వాగ్వాదం ఇరువర్గాల మధ్య కొట్లాటకు దారి తీయడంతో ఉధృతి నెలకొంది. పోలీసులు రంగప్రవేశం చేసి గొడవ సర్దుబాటు చేశారు. సుమారు రెండు గంటలపాటు పందేలు నిలిపివేశారు.
ఏటీఎంలు ఖాళీ
పండుగ పేరిట జనం పెద్ద ఎత్తున నగదును డ్రా చేశారు. భోగి పండుగ రోజు మధ్యాహ్నం ఒంటిగంట సమయానికే అనేక ఏటీఎంలు నగదు లేక మూతపడ్డాయి. ప్రత్యేకించి ఫోన్‌పే, గూగుల్‌పేలలో నగదు లావాదేవీలు చోటు చేసుకున్నాయి. పరస్పరం పందేలకు దిగితే అలాంటి వారంతా ఫోన్‌పేను ఉపయోగించుకునే ప్రయత్నం చేశారు. ఎక్కడా నగదు కనిపించకుండా మరికొందరు జాగ్రత్తలు పడ్డారు.
వాడవాడలా భోగి మంటలు
ఏలూరుసిటీ/ఏలూరుటూటౌన్/పెదవేగి, జనవరి 13(ఆంధ్రజ్యోతి): సంక్రాంతి పం డుగలో తొలి రోజు భోగి పండుగను జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో సోమవారం వేడుకగా నిర్వ హించారు. తెల్లవారుఝామునే భోగి మంట లను వాడవాడలా వేసుకుని భోగి పండుగకు ఘనంగా స్వాగతం పలికారు. సాయంత్రం ఇళ్ల వద్ద చిన్నారులకు సందె గొబ్బెమ్మలు, భోగిపండ్ల పేరంటాలను నిర్వహించారు. వైష్ణవ దేవాలయాల్లో గోదాదేవి కల్యాణాలను నిర్వహించారు. ఏలూరులో ఎమ్మెల్యే బడేటి చంటి క్యాంపు కార్యాలయం వద్ద భోగి మంట లను ఆయన ప్రారంభించారు. పెదవేగి మం డలం దుగ్గిరాలలో దెందులూరు చింతమనేని ప్రభాకర్ సోమవారం తెల్లవారుజామున భోగిమంట వేసి వేడుకలను ప్రారంభించారు.
విజేతలకు బుల్లెట్‌లు..
కొయ్యలగూడెం/ముదినేపల్లి/మండవల్లి/కైకలూరు, జనవరి 13 (ఆంధ్రజ్యోతి): ఎక్కువ పందేల్లో విజయం సాధించిన వారికి బుల్లెట్లు బహుమతులు ఇచ్చారు. కొయ్యలగూడెం మం డలం రామానుజపురం మూడు పందేల్లో రెండు గెలిచిన వారికి బుల్లెట్ బహుమతిగా ప్రకటించారు. ముదినేపల్లి మండలం బొమ్మి నంపాడులోని ఓబరిలో ఐదు పందేలకు మూ డు పందేలు గెలిచిన సుధీర్ అనే వ్యక్తి బుల్లెట్ ను కైవసం చేసుకున్నాడు. పెదపాలపర్రు బరిలో గుడివాడకు చెందిన ఎన్‌ఆర్‌ఐ సునీల్, వడాలి బరిలో ఏడు పందేల్లో పాల్గొని నాలుగు పందేలు గెలిచిన భీమవరానికి చెందిన విజయ రాజు బుల్లెట్‌లను కైవసం చేసుకున్నారు. మం డవల్లి మండలం భైరవపట్నంలో అధిక పం దేలు గెలిచిన కైకలూరు మండలం భుజబల పట్నంకు చెందిన శివాజీరాజుకు ఎలక్ట్రికల్ మో టార్‌సైకిల్‌ని అందజేశారు. కైకలూరు మండ లం భుజబలపట్నంలో 11 జోడాల కోడి పందే లకు ఆరు పందేలు గెలిచిన వారికి బుల్లెట్ బైక్‌ను బహుమతిగా అందజేశారు.
చావలిపాడులో పొట్టేలు పోటీలు
మండవల్లి : చావలిపాడులో పొట్టేలు పందే ల నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు కర్నాటక రాష్ట్రాలకు చెందిన సుమారు 150 పొట్టేళ్లను పోటీలకు తీసుకొచ్చారు. ఈ మేరకు సోమవారం రెండు పందేలు నిర్వహించారు. మంగళవారం సంక్రాంతి పండుగ సందర్భంగా ఎక్కువ సంఖ్యలో పోటీలు నిర్వహించనున్నారు.
Updated Date - Jan 14 , 2025 | 12:35 AM