Crime News: గుడివాడలో ప్రాణం తీసిన సిగరెట్...
ABN, Publish Date - Jan 16 , 2025 | 09:34 AM
కృష్ణా జిల్లా: గుడివాడలో సిగరెట్ ప్రాణం తీసింది. మంచానికి నిప్పంటుకుని వృద్ధుడు దుర్మరణం చెందాడు. గుడివాడలోని ద్రోణాదుల కాలనీకి చెందిన చల్లా వెంకటేశ్వరరావు (71) గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ మంచానికే పరిమితమయ్యాడు. సిగరెట్ వెలిగించి నిద్రలోకి జారుకున్నాడు.
కృష్ణా జిల్లా: గుడివాడ (Gudivada)లో సిగరెట్(Cigarette) ప్రాణం తీసింది. మంచానికి నిప్పంటుకుని వృద్ధుడు దుర్మరణం (Old Man Dies) చెందాడు. గుడివాడలోని ద్రోణాదుల కాలనీకి చెందిన చల్లా వెంకటేశ్వరరావు (71) గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ మంచానికే పరిమితమయ్యాడు. సిగరెట్ వెలిగించి నిద్రలోకి జారుకున్నాడు. సిగరెట్ పీకకు ఉన్న నిప్పు వెంకటేశ్వరరావు పడుకున్న మంచం ప్లాస్టిక్ నవ్వారుకు అంటుకుంది. దీంతో అగ్ని ప్రమాదం జరిగి.. తీవ్రంగా గాయపడ్డాడు. ఆ సమయంలో వెంకటేశ్వరరావుకు టిఫిన్ తీసుకువచ్చేందుకు ఆయన భార్య సావిత్రి బయటకు వెళ్లింది. తిరిగి వచ్చేసరికి మంటల్లో కాలిపోతున్న భర్తను చూడి కంగారుపడింది. ఇరుగు పొరుగు వారి సహాయంతో 108 వాహనం ద్వారా గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వృద్ధుడు వెంకటేశ్వరరావు మృతి. చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా ప్రదేశానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఈ వార్త కూడా చదవండి..
తిరుపతిలో యువతి బురిడీ
తిరుపతి: రూయా అత్యవసర విభాగంలో అనస్థీసియా టెక్నిషియన్ పేరుతో యువతి బురిడీ కొట్టించింది. ఓ మహిళా రోగి నుంచి 40 గ్రాముల బంగారు నగలను కొట్టేసింది. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సీసీటీవీ పుటేజీని పరిశీలించి.. చాకచక్యంగా యువతిని పట్టుకుని వెస్టు పోలీసులకు అప్పగించారు. పట్టుబడిన యువతి కడప జిల్లా, వల్లూరు మండలానికి చెందిన శ్రీవాణి గుర్తింపు
వివాహిత అదృశ్యం కలకలం
మరోవైపు తెలంగాణలోని మహబూబాబాద్‌లో వివాహిత అదృశ్యం కలకలం రేగింది. అత్తింటి వారే హతమార్చి ఇంటి ఆవరణలో గోయి తీసి పూడ్చిపెట్టినట్టు ప్రచారం జరుగుతోంది. దీంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేసారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. దీంతో అత్తంటివారు పరారీలో ఉన్నారు. వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. మహబూబాబాద్ సిగ్నల్ కాలనీలో ఈ ఘటన చోటు చేసుకుంది. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
అగ్ని ప్రమాదం..
హైదరాబాద్, కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో అర్జున్ థియేటర్ దగ్గరలో ఉన్న కంచుకోట టిఫిన్ సెంటర్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. గమనించిన స్థానికులు పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే సంఘటన ప్రదేశానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అగ్ని ప్రమాదం జరిగినప్పుడు హోటల్ సిబ్బంది లోపల నిద్రిస్తున్నట్లు యజమాని తెలిపారు. అయితే ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. కాగా ఘటనలో హోటల్ ఫర్నిచర్, రెండు ద్విచక్ర వాహనాలు దగ్ధమయ్యాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
తిరుమలలో భక్తుల రద్దీ.. వైకుంఠ ద్వారా దర్శనం
కనుమ రోజు ప్రయాణాలు చేయకూడదు.. ఎందుకంటే..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Jan 16 , 2025 | 09:34 AM