ప్రభుత్వ పథకాలపై అవగాహన కార్యక్రమం
ABN, Publish Date - Jan 09 , 2025 | 12:41 AM
స్థానిక కమ్యూనిటీ హాలులో బుధవారం నిర్వహించిన పట్టణ సమాఖ్య సమావేశంలో ప్రభుత్వ పథకాలపై అవగాహన కార్యక్రమం జరిగింది.
ప్రభుత్వ పథకాలపై అవగాహన కార్యక్రమం
కృష్ణలంక, జనవరి 8 (ఆంధ్రజ్యోతి) : స్థానిక కమ్యూనిటీ హాలులో బుధవారం నిర్వహించిన పట్టణ సమాఖ్య సమావేశంలో ప్రభుత్వ పథకాలపై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రాజెక్ట్ ఆఫీసర్ పి.వెంకట నారాయణ మాట్లాడుతూ మెప్మా ప్రాజెక్టులో జరుగుతున్న ఎస్‌హెచ్‌జీ ప్రొఫైలింగ్, ఎంఎస్‌ఎంఈ, పీఎం శ్వానిధి, ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన, వీధి వ్యాపారులకు సోషియా ఎకనామిక్ సర్వే, కామన్ ఇంట్రెస్ట్ గ్రూపులు, రివాల్వింగ్ ఫండ్ తదితర విషయాలపై ఈ ఏడాది లక్ష్యం, ఇప్పటి వరకు సాధించిన ప్రగతిపై రివ్యూ చేశారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ యూసీడీ విభాగం టీఈ ఫణికుమార్, సీవోలు, జిల్లా సమాఖ్య ప్రెసిడెంట్, ఆర్‌పీలు, సమాఖ్య అధికారులు పాల్గొన్నారు.
Updated Date - Jan 09 , 2025 | 12:41 AM