ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

మొవ్వ ఏఎంసీ చైర్మన్‌గా బీజేపీ నేత

ABN, Publish Date - Mar 29 , 2025 | 12:53 AM

మొవ్వ ఏఎంసీ చైర్మన్‌గా కూచిపూడి గ్రామానికి చెందిన బీజేపీ సీనియర్‌ నాయకుడు దోనేపూడి శివరామయ్యను నియమిస్తూ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

దోనేపూడి శివరామయ్యను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు

కూచిపూడి, మార్చి 28 (ఆంధ్రజ్యోతి): మొవ్వ ఏఎంసీ చైర్మన్‌గా కూచిపూడి గ్రామానికి చెందిన బీజేపీ సీనియర్‌ నాయకుడు దోనేపూడి శివరామయ్యను నియమిస్తూ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈయన రెండు దశాబ్దాలకుపైగా బీజేపీలో క్రియాశీలకంగా ఉన్నారు. 2009 నుంచి 2014 వరకు బీజేపీ మండల అధ్యక్షుడిగా పనిచేశారు. 2019 నుంచి కిసాన్‌ మోర్చా జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఇండియన్‌ రెడ్‌క్రా స్‌, రోటరీ సంస్థలతోపాటు స్వచ్ఛ కూచిపూడి వంటి సమాజ సేవా కార్యక్రమాల్లో పాల్గొని తనదైన ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. పార్టీలకతీతంగా అం దరితోనూ స్నేహపూర్వకంగా మెలిగే వ్యక్తిగా శివరామయ్య గుర్తింపు తెచ్చుకున్నారు. శివరామయ్య నియామకం పట్ల బీజేపీ నాయకులతో పాటు పార్టీలకతీతంగా పలువురు గ్రామస్థులు హర్షం వ్యక్తంచేశారు. ఆయనకు అభినందనలు తెలిపారు.

Updated Date - Mar 29 , 2025 | 12:53 AM