ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కోట్లాట..!

ABN, Publish Date - Jan 16 , 2025 | 12:36 AM

కోళ్లు కాళ్లు దువ్వాయ్‌.. నోట్లు ‘కట్టలు’ తెంచుకున్నాయ్‌.. రూ.కోట్లు పైకెగిరాయ్‌.. సంబరాల సంక్రాంతి మూడు రోజులూ పందెంకోళ్లే హవా సాగించాయ్‌. మూడుముక్కలాటలు ముచ్చటగా జరిగాయి. ఉమ్మడి కృష్ణాజిల్లాలోని చాలాప్రాంతాల్లో పండుగ మూడురోజులు కలిపి రూ.400 కోట్లకు పైగా కోడిపందేలు, ఇతరత్రా జూదాలు నిర్వహించారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి పందేలు కాస్త తక్కువగానే జరిగినప్పటికీ ఈసారి హైటెక్‌ బరులు ఆకట్టుకున్నాయి. సాయంత్రం 5 గంటలకు బరులను నిలిపివేయాలని పోలీసులు ఆంక్షలు విధించినా.. ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. చాలాచోట్ల ఇరువర్గాలు ఘర్షణలకు దిగగా, మందుబాబులు రూ.30 కోట్ల మద్యాన్ని తాగేశారు.

ఉమ్మడి కృష్ణాలో రూ.400 కోట్లకు కోడి పందేలు

పండుగ మూడు రోజులూ పందెంకోళ్లదే హవా

జిల్లా అంతటా భారీగా వెలిసిన బరులు

పేకాట, గుండాటకు కూడా ప్రాధాన్యం

అంపాపురం హైటెక్‌ బరిలో కాసులే కాసులు

కిక్కిరిసిన బరులు.. పట్టని పోలీస్‌ ఆంక్షలు

రాత్రి సమయాల్లోనూ జోరుగా జూదం

చాలాచోట్ల ఇరువర్గాల ఘర్షణ, దాడులు

యథేచ్ఛగా మద్యం విక్రయాలు

గత ఏడాదితో పోలిస్తే కాస్త తక్కువే..

ఆంధ్రజ్యోతి మచిలీపట్నం/విజయవాడ : బాపులపాడు మండలంలోని అంపాపురంలో హైటెక్‌ హంగులతో కోడిపందేలు, పేకాట శిబిరాలు మూడు రోజుల పాటు జరిగాయి. ఒక్కో పందెం రూ.3 లక్షలకు తక్కువకాకుండా వేశారు. పెద్దబరుల్లో ఒక్కో కోడిపందెం రూ.10 లక్షలకు తక్కువ కాకుండా నిర్వహించారు. అంపాపురంలో ఏర్పాటుచేసిన శిబిరానికి తెలంగాణ నుంచి అధికంగా తరలివచ్చారు. దీంతో విజయవాడ-ఏలూరు జాతీయ రహదారిపై కార్లు బారులు తీరి కనిపించాయి. కాగా, చాలామంది ఈసారి భీమవరం వైపు వెళ్లారు. దీంతో ఏటా రూ.30 కోట్ల వరకూ జరిగే పందేలు ఈసారి రూ.20 కోట్లకే పరిమితమయ్యాయి. గుండాట శిబిరాల వద్ద మహిళలు అధిక సంఖ్యలో పందేలు కాశారు. నగదు రూపంలో కాకుండా టోకెన్లు అందించి మరీ పందెపురాయుళ్లను అనుమతించారు. బుధవారం వరుసగా ఐదు పందేలు గెలిచిన బాబీకి నిర్వాహకులు బుల్లెట్‌ను బహుమతిగా అందజేశారు. రామవరప్పాడు, ఎనికేపాడు గ్రామాల్లో భారీగా బరులు ఏర్పాటు చేశారు.

  • గుడివాడ నియోజకవర్గంలో మూడు రోజులుగా కోడి పందేలు, పేకాట శిబిరాలు జరిగాయి. గుడివాడలోని గౌతమ్‌ స్కూల్‌ వెనుక, బొమ్ములూరులో, నందివాడ మండలం నందివాడ, పుట్టగుంట, పోలుకొండ, రుద్రపాక శివారు గొల్లగూడెం, తమిరిశలో కోడి పందేలు, పేకాట నిర్వహించారు. గుడ్లవల్లేరు మండలంలో ఏర్పాటుచేసిన పందేల వద్దకు మహిళలు అధికంగా వచ్చారు. గుండాటల్లో పాల్గొని పందేలు కాశారు. గుడ్లవల్లేరు, కౌతవరం, డోకిపర్రు, కూరాడ, కుచ్చికాయలపూడి బరుల్లో రూ.కోట్లు చేతులు మారాయి. నందివాడ మండలం గండేపూడి బరిలో ఇరువర్గాలు దాడులు చేసుకున్నాయి.

  • మచిలీపట్నంలోని రుద్రవరం బరిలో కోడి పందేలు సక్రమంగా నిర్వహించడం లేదని పోలాటితిప్ప గ్రామానికి చెందినవారు ప్రశ్నించారు. ఇరువర్గాలు కొట్లాడుకున్నా పోలీసులు కన్నెత్తి చూడలేదు. మేకావానిపాలెం, శ్రీనివాసనగర్‌, గోకవరం బరుల వద్ద పెద్ద ఎత్తున పేకాట శిబిరాలు నిర్వహించారు. పేకాట కోసం ప్రత్యేకంగా గదులు ఏర్పాటుచేసి రూ.5 వేలు, రూ.10 వేల చొప్పున టోకెన్లు అందించారు. బౌన్సర్లను ఏర్పాటుచేసి, టోకెన్లు ఉన్నవారినే లోపలికి పంపారు. అక్కడే మద్యం విక్రయాలు జరిపారు. మచిలీపట్నంలో ఏర్పాటుచేసిన బరులను సాయంత్రం 5 గంటలకు మూసివేయాలని పోలీసులు చెప్పినా, నిర్వహకులు వినిపించుకోలేదు. రాత్రి సమయంలోనూ కొనసాగించారు.

  • పెడన నియోజకవర్గంలో తోటమూల, కొంకేపూడి, బంటుమిల్లి మండలం పెదతుమ్మిడి, అర్తమూరులో కోడి పందేలు భారీగా జరిగాయి. బంటుమిల్లి, పెందుర్రు, నాగేశ్వరరావుపేట, తుమ్మిడి తదిత ర ప్రాంతాల్లో పేకాట శిబిరాలను మూడు రోజులు రాత్రిపూట కొనసాగించారు. గూడూరు మండలంలోని గూడూరు-పెడన రహదారి వెంబడి, పోసినవారిపాలెంలలో బరులు ఏర్పాటుచేసి పందేలు వేశారు. పేకాట కూడా జరిగింది.

  • అవనిగడ్డ నియోజవర్గంలోని పులిగడ్డ, పులిగడ్డపల్లెపాలెం, అవనిగడ్డ, పాతఎడ్లంక, గొట్టంమిల్లుల వద్ద కోడి పందేలు, పేకాట శిబిరాలు నిర్వహించారు. నాగాయలంక, చల్లపల్లి, మోపిదేవి, ఘంటసాల, కోడూరు మండలాల్లో కోడి పందేలు, పేకాట, గుండాట నిర్వహించారు.

  • పామర్రు నియోజకవర్గం కొత్తపెదమద్దాలి, పెదపారుపూడి మండలం యలమర్రు, పమిడిముక్కల మండలం కపిలేశ్వరపురం, హనుమంతపురం, మొవ్వ మండలం కోసూరు, కూచిపూడి, భట్లపెనుమర్రు, తోట్లవల్లూరు మండలం గరికపర్రు, కొమ్ముమూరు, వల్లూరుపాలెం, తోట్లవల్లూరులో కోడి పందే మూడు రోజులు జోరుగా కొనసాగాయి.

మూడు రోజులు రూ.30 కోట్ల మద్యం

మూడు రోజులపాటు మందుబాబులు మొత్తం రూ.30 కోట్ల మద్యాన్ని తాగేశారు. ఉమ్మడి జిల్లాలో మద్యం వ్యాపారులు ఈనెల 11వ తేదీన డిపోల నుంచి రూ.8.46 కోట్లు, 12న రూ.7.41 కోట్లు, 13న రూ.16.59 కోట్ల సరుకును షాపులకు తరలించారు. 14వ తేదీ మధ్యాహ్నం వరకు రూ.4.50 కోట్ల విలువైన మద్యం కొన్నారు. కనుమ రోజున సెలవు కావడంతో మూడు రోజులకు సరిపడా 14వ తేదీ సాయంత్రానికే సమకూర్చుకున్నారు.

Updated Date - Jan 16 , 2025 | 12:36 AM