ఆక్రమణలు తొలగించే వరకు ఆందోళన

ABN, Publish Date - Mar 21 , 2025 | 12:45 AM

హాకర్ల ముసుగులో ప్రధాన వ్యాపార సముదాయాలకు ఆటం కంగా మారి, వినియోగదారులను ఇబ్బం దులకు గురిచేస్తున్న బీసెంట్‌రోడ్డు కబ్జా దారుల ఆగడాలకు అధికారులు కళ్లెం వేయాలని బీసెంట్‌ రోడ్డు వర్తక సంఘం, బీసెంట్‌ రోడ్డు భవన యజమానుల సంక్షేమ సంఘం నేతలు డిమాండ్‌ చేశారు.

ఆక్రమణలు తొలగించే వరకు ఆందోళన
బీసెంట్‌ రోడ్డులో నిరసన తెలుపుతున్న వర్తక సంఘం నాయకులు

గవర్నర్‌పేట, మార్చి 20 (ఆంధ్రజ్యోతి): హాకర్ల ముసుగులో ప్రధాన వ్యాపార సముదాయాలకు ఆటం కంగా మారి, వినియోగదారులను ఇబ్బం దులకు గురిచేస్తున్న బీసెంట్‌రోడ్డు కబ్జా దారుల ఆగడాలకు అధికారులు కళ్లెం వేయాలని, బీసెంట్‌ రోడ్డును రక్షించాలని బీసెంట్‌ రోడ్డు వర్తక సంఘం, బీసెంట్‌ రోడ్డు భవన యజమానుల సంక్షేమ సంఘం నేతలు డిమాండ్‌ చేశారు. రెండు సంఘాల ఆధ్వర్యంలో గురువారం బీసెంట్‌ రోడ్డు వ్యాపారులు సేవ్‌ బీసెంట్‌రోడ్డు అంటూ నిరసన ర్యాలీ నిర్వహించారు. హాకర్ల ముసు గులో వివిధ పార్టీల అనుచరులు చేస్తున్న అరాచకాలు ఆపాలని, అధికారులు జోక్యం చేసుకోవాలని వర్తక సంఘ నేతలు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బీసెంట్‌రోడ్డులో ఆక్రమణలు తొలగించే వరకు దశలవారీగా ఉద్యమాలు చేపడతామన్నారు. శుక్రవారం క్యాండిల్‌ ర్యాలీ నిర్వహిస్తామన్నారు. వర్తకం సంఘం నేతలు చల్లపల్లి శ్రీనివాసరావు, అమర్‌నాగ్‌, పవన్‌కుమార్‌, రవిచంద్‌, లక్ష్మీఅన్నపూర్ణ, శ్రీకాంత్‌, నాడార్‌ శ్రీనివాస్‌, సునీల్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 21 , 2025 | 12:45 AM