గడ్డిమందు తాగి వ్యవసాయ కూలీ ఆత్మహత్య
ABN, Publish Date - Mar 31 , 2025 | 11:49 PM
కొణకంచి గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీ షేక్ కరీముల్లా(42) గడ్డి మందు తాగి మృతి చెందాడు.

పెనుగంచిప్రోలు, మార్చి 31(ఆంధ్రజ్యోతి): కొణకంచి గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీ షేక్ కరీముల్లా(42) గడ్డి మందు తాగి మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం కరీముల్లా మద్యానికి బానిసై కుటుం బ సభ్యులను ఇబ్బంది పెడుతున్నాడు. రంజాన్ పండగ దినాల్లోనైనా మ ద్యం తాగొద్దని భార్య సైదాబీ చెప్పింది. దానిని అతను అవమానంగా భావించాడు. వెంటనే గడ్డి మందు తాగాడు. అతడిని 108లో నందిగామ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధా రించారు. సైదాబీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఎంఎస్కే అర్జున తెలిపారు.
Updated Date - Mar 31 , 2025 | 11:49 PM