విశాఖపట్నం-చర్లపల్లి మధ్య హోలీ ప్రత్యేక రైళ్లు
ABN, Publish Date - Mar 15 , 2025 | 01:38 AM
దక్షిణ మధ్య రైల్వే హోలీ ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ ఎ.శ్రీధర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.

రైల్వేస్టేషన్, మార్చి 14 (ఆంధ్రజ్యోతి): దక్షిణ మధ్య రైల్వే హోలీ ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ ఎ.శ్రీధర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. హోలీ రద్దీ నేపథ్యంలో ఈ రైళ్లను చర్లపల్లి-విశాఖపట్నం మధ్య అప్ అండ్ డౌన్ సర్వీసులను నడుపుతున్నట్లు పేర్కొన్నారు. ఈనెల 16వ తేదీ విశాఖపట్నం-చర్లపల్లి రైలు(నెంబరు 08579) సాయంత్రం 6.20 గంటలకు బయల్దేరి, మరునాడు ఉదయం 8 గంటలకు చర్లపల్లి చేరుకుంటుంది. ఈనెల 17వ తేదీ చర్లపల్లి-విశాఖపట్నం రైలు(నెంబరు 08580) ఉదయం 10 గంటలకు బయల్దేరి అదేరోజు రాత్రి 10 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. ఈ ప్రత్యేక రైళ్లు దువ్వాడ, అనకాపల్లి, యలమంచిలి, తుని, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, నిడదవో లు, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, నడికుడి, మిర్యాలగూడ, నల్గొండ స్టేషన్లలో ఆగుతాయి.
Updated Date - Mar 15 , 2025 | 01:38 AM