IIT Medical Academy: ఐఐటీ విద్యార్థులు ఆందోళన
ABN, Publish Date - Mar 14 , 2025 | 01:42 PM
ఐఐటీ మెడికల్ అకాడమీ మూసివేస్తూ విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. దీంతో విద్యార్థుల భవిష్యత్తుపై వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అకాడమీని కొనసాగిస్తేనే విద్యార్థులకు మెరుగైన విద్య, భవిష్యత్ భద్రంగా ఉంటుందని అంటున్నారు.

కృష్ణా జిల్లా: ఈడుపుగల్లు (Eedupugallu)లో ఐఐటీ విద్యార్థులు (IIT students) ఆందోళనకు (Protest0 దిగారు. ఐఐటీ మెడికల్ అకాడమీ (IIT Medical Academy) మూసివేస్తూ (closure) విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. దీంతో 6 వందల మంది మొదటి సంవత్సరం విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. అయితే అకాడమీ యాజమాన్యం మాత్రం ఫస్ట్ ఇయర్ విద్యార్థులను మరో ఐఐటీ క్యాంపస్‌లోకి తీసుకుంటామని చెప్పడంతో విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఏడాది ఈడుపుగల్లు ఐఐటీ మెడికల్ అకాడమీలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ.. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు.
Also Read..:
ఈ సమయంలో వైసీపీ గురించి అవసరమా..
రాష్ట్ర వ్యాప్తంగా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల విద్యాలయాల సంస్థ ఐఐటీ–మెడికల్ అకాడమీలు మూడు మాత్రమే ఉన్నాయి. కృష్ణా జిల్లా ఈడుపుగల్లు, కర్నూలు జిల్లా చిన్నటేకూరు, గుంటూరు జిల్లా అడవి తక్కెళ్లపాడు ప్రాంతాల్లో ఇవి నడుస్తున్నాయి. చిన్నటేకూరు, అడవి తక్కెళ్లపాడు రెండు అకాడమీలు బాలురకు, ఈడుపుగల్లు అకాడమీ ప్రత్యేకించి బాలికలకు ఏర్పాటు చేశారు. 2017లో ఏర్పాటైన ఈ కేంద్రంలో ప్రస్తుతం 500 మందికి పైగా విద్యనభ్యసిస్తున్నారు.
న్యాయ పోరాటానికి సిద్ధం..
ఈ పరిస్థితుల్లో విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అకాడమీని కొనసాగిస్తేనే విద్యార్థులకు మెరుగైన విద్య, భవిష్యత్ భద్రంగా ఉంటుందని అంటున్నారు. అధికారులు తమ ఆవేదన అర్థం చేసుకోవాలని కోరుతున్నారు. అకాడమీని కొనసాగించేలా విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు న్యాయపోరాటానికి దిగారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఆ షాపులన్నీ అక్రమమైనవని తెలిసినా..
శంషాబాద్‌కా.. వామ్మో అంటున్న క్యాబ్ డ్రైవర్లు..
మెగాస్టార్ చిరంజీవికి అరుదైన గౌరవం..
For More AP News and Telugu News
Updated Date - Mar 14 , 2025 | 01:43 PM