ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

‘పుంజు’కున్నాయ్‌

ABN, Publish Date - Jan 12 , 2025 | 12:47 AM

కోర్టులు హెచ్చరిస్తున్నా.. పోలీసులు దాడులు చేస్తున్నా.. సంక్రాంతి పండుగ ముసుగులో కోడిపందేల బరులు భారీగా సిద్ధమవుతున్నాయి. పేకాట, గుండాటతో పాటు కేసినోకు కూడా పక్కా ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. ఓవైపు బరుల నిర్వాహకులు పెద్ద ఎత్తున సౌకర్యాలు సమకూరుస్తూ దర్జాను ప్రదర్శిస్తుండగా, మరోవైపు రూ.కోట్లలో ఖర్చుచేసైనా పంతం నెగ్గించుకోవాలని పందెపురాయుళ్లు మీసాలు మెలేస్తున్నారు. మొత్తానికి సోమవారం నుంచి జిల్లావ్యాప్తంగా వందల బరుల్లో కోళ్లు రూ.కోట్ల కోసం కొట్టుకోనున్నాయి. - మచిలీపట్నం, ఆంధ్రజ్యోతి

ఈడుపుగల్లులో పందేల కోసం కోళ్లకు స్విమ్మింగ్‌ చేయిస్తున్న పందెపురాయుళ్లు
  • జిల్లావ్యాప్తంగా భారీగా సిద్ధమైన కోడిపందేల బరులు

  • కేసినోతో పాటు పేకాట, గుండాట కూడా..

  • ఒక్కో పందేనికి రూ.లక్షల్లో రేటు పెట్టిన నిర్వాహకులు

  • జిల్లావ్యాప్తంగా దాడులు చేస్తున్న పోలీసులు

  • తెరవెనుక మాత్రం నిర్వాహకులతో బేరసారాలు

  • గన్నవరం నియోజకవర్గంలో భారీగా శిబిరాలు

  • అంపాపురంలో హైటెక్‌ హంగులతో అంతా సిద్ధం

అంపాపురంలో భారీ ఏర్పాట్లు

బాపులపాడు మండలంలోని అంపాపురంలో హైటెక్‌ హంగులతో కోడి పందేలు, పేకాట నిర్వహించేందుకు భారీస్థాయిలో శిబిరాన్ని ఏర్పాటుచేశారు. పోలీసులు శనివారం ఈ శిబిరం వద్దకు వెళ్లి తనిఖీలు చేసినా నిర్వహకులు అంతగా పట్టించుకోలేదు. ఇక్కడ పండుగ మూడు రోజుల్లో రూ.వందకోట్ల వరకు నగదు చేతులు మారుతుందని నిర్వాహకులు ప్రచారం చేస్తున్నారు. ఇక్కడ కోడిపందేలకు సంబంధించి ఓ పెద్దబరి, నాలుగు చిన్నబరులు, పదికిపైగా పేకాట శిబిరాలు, మూడు కేసినోలు ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు. కేసీనో నిర్వహణ కోసం గోవా నుంచి మనుషులను తీసుకొచ్చారు. పెద్దబరుల్లో ఒక్కో కోడిపందేనికి కనీసం రూ.20 లక్షలుగా నిర్ణయించారు. చిన్నబరుల్లో రూ.లక్షన్నర నుంచి రూ.రెండు లక్షల వరకు కోడిపందేలు నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. ఈ శిబిరాల్లో మద్యం సరఫరాకు ఏర్పాట్లు చేస్తున్నారు. శిబిరాల్లో ఏసీ గదులు, ఎల్‌ఈడీ స్ర్కీన్లు సిద్ధం చేస్తున్నారు.

  • గుడివాడ నియోజకవర్గంలోని బొమ్ములూరు, వలివర్తిపాడు, నందివాడ మండలం పోలుకొండ, రుద్రపాక, తమిరిశలో కోడిపందేలు, పేకాట శిబిరాలు నిర్వహించేందుకు పూర్తిస్థాయి ఏర్పాట్లు చేశారు. గుడ్లవల్లేరు మండలం వేమవరం, కౌతవరం, కూరాడ, పెంజెండ్రలో ఏర్పాటుచేసిన బరుల వద్దకు పోలీసులు, మండల స్థాయి ప్రత్యేక బృందాలు వెళ్లి శనివారం శిబిరాలను తొలగించాయి. అయినా ఇక్కడ బరులు ఏర్పాటు చేస్తామని నిర్వహకులు ఘంటాపథంగా చెబుతున్నారు.

  • మచిలీపట్నంలోని మేకావానిపాలెం, గోపువానిపాలెం, శ్రీనివాసనగర్‌, గోకవరం, రుద్రవరం తదితర ప్రాంతాల్లో బరులు ఏర్పాటు చేస్తున్నారు. రుద్రవరంలో కోడి పందేలు నిర్వహించే శిబిరం వద్ద ముగ్గుల పోటీల నిర్వహణ ముసుగులో ఏర్పాట్లు చేస్తున్నారు.

  • పెడన నియోజకవర్గంలోని తోటమూల, కొంకేపూడి, బంటుమిల్లి మండలం పెదతుమ్మిడి, అర్తమూరులో కోడిపందేల శిబిరాలను ఏర్పాటు చేశారు. బంటుమిల్లిలో రాత్రిపూట కూడా పేకాట శిబిరం నిర్వహించేందుకు అంతా సిద్ధం చేశారు. గూడూరు మండలం గూడూరు-పెడన రహదారి వెంబడి, పోసినవారిపాలెంలో బరులు సిద్ధమయ్యాయి.

  • అవనిగడ్డ నియోజవర్గంలోని పులిగడ్డ, పులిగడ్డపల్లెపాలెం, అవనిగడ్డ, ఎడ్లంక, బందలాయి చెరువుతోపాటు చల్లపల్లి మండలం నడకుదురు, ఘంటసాల మండలం పాపవినాశనం గ్రామాల్లో కృష్ణా కరకట్టకు దిగువన బరులు నిర్మించారు. మోపిదేవి మండలంలో రెండు, నాగాయలంక, కోడూరు మండలాల్లో నాలుగు చొప్పున ఏర్పాటు చేశారు. బరుల వద్ద పేకాట, గుండాట నిర్వహిస్తామని నిర్వాహకులు ప్రచారం చేస్తున్నారు. విదేశాల్లో మాదిరిగా గ్రూప్‌ పందేలను నిర్వహించనున్నారు. ఈ నియోజకవర్గంలో మొత్తం 19 శిబిరాలు ఏర్పాటు కావడం గమనార్హం.

  • పామర్రు నియోజకవర్గంలోని పామర్రు మండలం కొత్తపెదమద్దాలి, పెదపారుపూడి మండలం యలమర్రు, పమిడిముక్కల మండలం కపిలేశ్వరపురం, హనుమంతపురం, మొవ్వ మండలం కోసూరు, భట్లపెనుమర్రు, తోట్లవల్లూరు మండలం గరికపర్రు, కొమ్ముమూరు, వల్లూరుపాలెం, తోట్లవల్లూరులో బరులు భారీగా వెలిశాయి. పోలీసులు వద్ద అనుమతులు తీసుకున్న నిర్వాహకులు వారు తెరపైకి రాకుండా రూ.లక్షల్లో బేరాలుపెట్టి వేరే వ్యక్తులకు విక్రయించేస్తున్నారు.

Updated Date - Jan 12 , 2025 | 12:47 AM