ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కాలుదువ్విన కోళ్లు

ABN, Publish Date - Jan 14 , 2025 | 01:00 AM

మండలంలో విచ్చలవిడిగా బరులు ఏర్పాటు చేశారు. కోడి కాళ్లకు కత్తులు కట్టి బరుల్లో పందేలకు దించారు.

ఈడుపుగల్లు బరి వద్ద భారీ సంఖ్యలో నిలిపి ఉంచిన వాహనాలు

బరుల వద్ద గుండాట, జూదశిబిరాలు

తొలిరోజు భారీగా చేతులు మారిన నగదు

కృత్తివెన్ను, జనవరి 13 (ఆంధ్రజ్యోతి): మండలంలో విచ్చలవిడిగా బరులు ఏర్పాటు చేశారు. కోడి కాళ్లకు కత్తులు కట్టి బరుల్లో పందేలకు దించారు. జాతీయ రహదారి పక్కన కోడిపందేలతో పాటు, జూదక్రీడలు భారీగా నిర్వహిస్తున్నారు. ము నిపెడ, గరిశపూడి, లక్ష్మీపురం రంగా సెంటర్‌, పల్లెపాలెం, లక్ష్మీపురం లాకు సెంటర్‌, నిడమర్రు, చినగొల్లపాలెం, కృత్తివెన్ను పల్లెపాలెం గ్రామాల్లో బరులు ఏర్పాటు చే శారు. మునిపెడలో విజేతకు రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బైక్‌, రంగా సెంటర్‌ బరిలో మరో బైక్‌ను బహుమతిగా ఇవ్వనున్నారు. జాతీయ రహదారి పక్కనే బరులు ఉండటంతో రహదారి పొడవునా ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతోంది. రూ.లక్షలు చేతులు మారుతున్నాయి.

కోడూరులో యథేచ్ఛగా..

కోడూరు: కోడూరు తూర్పువైపు ప్రభుత్వాస్పత్రి సమీపంలో రెండు బరులు, కోడూరు-నరసింహాపురం రోడ్డులో ఒకటి, విశ్వనాథపల్లిలో మరొక బరిని ఏర్పాటు చేసి యథేచ్ఛగా కోడిపందేలు నిర్వహిస్తున్నారు. బరుల ద గ్గర రాత్రివేళ ఇబ్బంది లేకుండా ఎల్‌ఎ్‌సఈడీ లైట్లు ఏర్పాట్లు చేశారు. రూ.లక్ష లు చేతులు మారుతున్నాయి. పోలీసు అధికారులకు భారీస్థాయిలో ముడుపులు అందాయని తెలుస్తోంది.

తిరువూరు నియోజకవర్గంలో భారీగా..

తిరువూరు: నియోజకవర్గంలో భారీస్థాయిలో కోడిపందేలు, జూదాలు ప్రారంభమయ్యాయి. ఎంపీ కేశినేని శివనాథ్‌(చిన్ని), ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు, ఆర్గానిక్‌ సర్టిఫికేషన్‌ అథారిటీ చైర్మన్‌ శావల దేవదత్‌లు సంప్రదాయక కోడిపందేలు ప్రారంభించారు. ఎంపీ, ఎమ్మెల్యేలు కోడిపందేల శిబిరాలు సందర్శించేందుకు రావడంతో స్థానిక పోలీసు అధికారులు వారితో పాటు, పందేలు జరిగే తోటల్లోకి వచ్చారు. పార్టీ నాయకులతో కలిసి తోటల్లో విందుభోజనాలు చేశారు.

కోలాహలంగా అంపాపురం బరి

హనుమాన్‌జంక్షన్‌రూరల్‌: అంపాపురం బరిలో సోమవారం మధ్యాహ్నం నుంచి కోడిపందేలు భారీగా ఊపందుకున్నాయి. రెండు పెద్ద బరుల్లో పదుల సంఖ్యలో రూ.లక్షల్లో పందేలు నడిచాయి. కోట్లలో నగదు చేతులు మారింది. పే కాట శిబిరం, గుండాట, కోసు ఏర్పాటు చేయడంతో బరి ప్రాంగణం కోలాహలం గా మారింది. కె.సీతారాంపురం, బిళ్లనపల్లితో పాటు వేలేరు, సింగన్నగూడెం, కొత్తపల్లి, తిప్పనగుంట గ్రామాల్లోనూ చిన్నచిన్న బరులు ఏర్పాటుచేశారు. అంపాపురం బరి వద్ద ప్రాగణం మొత్తం కార్లతో నిండిపోయింది. చుట్టుపక్కల గ్రామాలతో పాటు తెలంగాణ, ఒడిసాకు చెందినవారు, కృష్ణా, ఉభయగోదావరి జిల్లాలకు చెందిన వారు భారీగా తరలివచ్చారు. దూరం నుంచి వచ్చే వారికి నిర్వాహకులు ఆతిథ్యం ఏర్పాటు చేశారు.

టేబుల్‌ వద్దకే సమస్తం

పేకాట శిబిరంలో కూర్చున్నవారికి టేబుల్‌ వద్దకే మందు, విందు అందేలా నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. ఇక లోన- బయట ఆటకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. ప్రధాన బరికి పోటీగా ఇక్కడ కూడా నగదు భారీగా చేతులు మారుతోంది. బార్లలో ప్రత్యేక బ్రాండ్ల మద్యం అందుబాటులో ఉంచారు. ఆహారం కోసం ప్రత్యేకంగా వంటశాల ఏర్పాటుచేశారు. మాంసాహార వంటలు అందుబాటులో ఉంచారు.

పందేలు కాస్తున్న మహిళలు

కోడిపందేల బరిలో కొందరు మహిళలు రూ.లక్షల్లో పందేలు కట్టారు. గుం డాట ఆడేందకూ మరికొందరు ఆసక్తి కనబరిచారు. మహిళలకు నిర్వాహకులు వీఐపీ సేవలందిస్తున్నారు.

Updated Date - Jan 14 , 2025 | 01:00 AM