శాసనసభ్యుల క్రీడా పోటీలకు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేయండి
ABN, Publish Date - Mar 14 , 2025 | 12:05 AM
శాసనసభ్యుల క్రీడా పోటీలకు స్టేడియంలో ఏర్పాట్లను పూర్తి స్థాయిలో సిద్ధం చేయాలని మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర అధికారులను ఆదేశించారు.

శాసనసభ్యుల
క్రీడా పోటీలకు
పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేయండి
మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశం
విజయవాడ (స్పోర్ట్స్), మార్చి 13 (ఆంధ్రజ్యోతి): శాసనసభ్యుల క్రీడా పోటీలకు స్టేడియంలో ఏర్పాట్లను పూర్తి స్థాయిలో సిద్ధం చేయాలని మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర అధికారులను ఆదేశించారు. గురువారం స్టేడియంలో జరగుతున్న ఏర్పాట్లను పరిశీలించిన ఆయన అధికారులకు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరపాలక సంస్థ తరపున పోటీలకు అవసరమైన ఏర్పాట్లకు ఎటువంటి అంతరాయం లేకుండా చూడాలని, అవసరమైన ఫ్లడ్ లైట్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో చీఫ్ ఇంజనీర్ ఆర్.శ్రీనాథ్‌రెడ్డి, ఇన్‌చార్జి చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ సురేష్‌బాబు పాల్గొన్నారు.
నీటి ఎద్దడి లేకుండా
బోర్లు పునరుద్ధరించాలి
గుణదల: వేసవి కాలంలో తాగునీటి సమస్య తలెత్తకుండా అవసరమైతే గతంలో ఉన్న బోర్లను పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకోవాలని నగర కమిషనర్ ధ్యానచంద్ర సంబంధిత అధికారులను ఆదేశించారు. నగర పర్యటనలో భాగంగా ఆయన గురువారం గుణదలలోని ఒకటవ డివిజన్లో పర్యటించారు. పప్పులమిల్లు సెంటర్, గుణదల కార్మిల్‌నగర్, గుణదల నుంచి రామవరప్పాడు వెళ్లే సర్వీసు రోడ్డు, వీఎంసీ ఎంప్లాయిస్ కాలనీ తదితర ప్రాంతాల్లో పర్యటించి స్థానికులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వీఎంసీ ఎంప్లాయీస్ కాలనీలో రోడ్లు, వీధిలైట్లు ఏర్పాటు తదితర అంశా లపై స్పందించిన ఆయన ఆరు నెలల వ్యవధిలో వారు అడిగినవన్నీ ఏర్పాటు చేయాలని చెప్పారు.
నగర సుందరీకరణకు ప్రత్యేక చర్యలు
కార్పొరేషన్: నగర సుందరీకరణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని, పార్కులు, కాల్వగట్లను, ప్రధాన కూడళ్లను మొక్కలు గ్రీనరీతో సుందరంగా తీర్చిదిద్దుతున్నామని నగర కమిషనర్ ధ్యానచంద్ర తెలిపారు. గురువారం ప్రధాన కార్యాలయం ఎదురుగా ఉన్న కెనాల్ కాల్వ సుందరీకరణ పనులను కమిషనర్ పలువురు ఇంజనీరింగ్, ఉద్యానశాఖ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ పర్యటనలో డిప్యూటీ డైరెక్టర్ హార్టికల్చర్ రామ్మోహన్, సూపరింటెండెంట్ ఇంజనీర్ (వర్క్స్) పి. సత్యకుమారి, (పార్క్సు) ఈఈ ఇన్‌చార్జి చంద్రశేఖర్, పలువురు సిబ్బంది పాల్గొన్నారు.
Updated Date - Mar 14 , 2025 | 12:05 AM