రూ.12.84 కోట్ల మునిసిపల్‌ బడ్జెట్‌కు ఆమోదం

ABN, Publish Date - Mar 25 , 2025 | 12:51 AM

2025-2026 సంవత్సరానికి రూ.12.84 కోట్లతో మునిసిపల్‌ బడ్జెట్‌కు కౌన్సిల్‌ ఆమోదం తెలిపింది.

రూ.12.84 కోట్ల మునిసిపల్‌ బడ్జెట్‌కు ఆమోదం
సమావేశంలో మాట్లాడుతున్న ప్రభుత్వ విప్‌ తంగిరాల సౌమ్య

నందిగామ, మార్చి 24(ఆంధ్రజ్యోతి): 2025-2026 సంవత్సరానికి రూ.12.84 కోట్లతో మునిసిపల్‌ బడ్జెట్‌కు కౌన్సిల్‌ ఆమోదం తెలిపింది. సోమవారం జగ్జీవన్‌రామ్‌ భవన్‌లో మునిసిపల్‌ బడ్జెట్‌ సమావేశం చైర్‌పర్సన్‌ మండవ కృష్ణకుమారి అధ్యక్షతన నిర్వహించారు. అధికారులు బడ్జెట్‌ వివరా లు వెల్లడించారు. రూ.12.84 కోట్ల ఆదాయం సమకూరుతుందని, రూ.12.05 కోట్ల ఖర్చు అవుతుందని అంచనా వేశారు. రూ.79 కోట్ల మిగులుతో బడ్జెట్‌ ను ప్రవేశపెట్టారు. సభ్యులు బడ్జెట్‌కు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు.

అద్భుతమైన బడ్జెట్‌: విప్‌ తంగిరాల సౌమ్య

బడ్జెట్‌ రూపకల్పన, ప్రాధాన్యతా రంగాలను గుర్తించి వాటిపై దృష్టి సారించిన పాలకవర్గాన్ని అఽధికారులను ప్రభుత్వ విప్‌ తంగిరాల సౌమ్య అభినందించారు. పట్టణ సమగ్ర అభివృద్దికి ఈబడ్జెట్‌ ఎంతగానో దోహదపడుతుందని అన్నారు. ఏఐఐబీ ద్వారా నందిగామ పట్టణానికి రూ.89 కోట్లతో మంచినీటి పధకం మంజూరైందన్నారు. ఆ పథకం పూర్తయిన తరువాత పట్టణ ప్రజలకు సమర్థవంతంగా మంచినీరు ఇవ్వగలుగుతామన్నారు. ప్రాధాన్య క్రమంలో అన్ని రంగాలను అభివృద్ధి చేసి పట్టణాన్ని ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దుతామన్నారు. కమిషనర్‌ రమణబాబు, ఏఈ ఫణిశ్రీనివాస్‌, కౌన్సిలర్లు హాజరయ్యారు.

Updated Date - Mar 25 , 2025 | 12:51 AM