Share News

కొత్తగా పాస్‌పోర్టు కార్యాలయం

ABN , Publish Date - Apr 08 , 2025 | 01:09 AM

ఇంద్రభవనాన్ని తలపించేలా విజయవాడ ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయం కొలువుతీరింది. బందరు రోడ్డులోని హోటల్‌ మనోరమ పక్కన ఉన్న స్టాలిన్‌ భవనం నాల్గో అంతస్థులో ఈ కార్యాలయం ఏవిధంగా తీర్చిదిద్దారన్న దానిపై పాస్‌పోర్టు శాఖ సోమవారం మీడియా టూర్‌ నిర్వహించింది.

కొత్తగా పాస్‌పోర్టు కార్యాలయం

నేడే ప్రారంభం

(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : ఇంద్రభవనాన్ని తలపించేలా విజయవాడ ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయం కొలువుతీరింది. బందరు రోడ్డులోని హోటల్‌ మనోరమ పక్కన ఉన్న స్టాలిన్‌ భవనం నాల్గో అంతస్థులో ఈ కార్యాలయం ఏవిధంగా తీర్చిదిద్దారన్న దానిపై పాస్‌పోర్టు శాఖ సోమవారం మీడియా టూర్‌ నిర్వహించింది. ఈ కేంద్రాన్ని మంగళవారం కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి కీర్తివర్ధన్‌ సింగ్‌ లాంఛనంగా ప్రారంభించనున్నారు. సందర్శకుల కోసం తీర్చిదిద్దిన అధునాతన సదుపాయాలను పాస్‌పోర్టు ఆఫీసర్‌ శివ హర్ష మీడియాకు వివరించారు. ఆకట్టుకునే లాంజ్‌, వెయిటింగ్‌ హాల్‌, పాస్‌పోర్ట్‌ ఆఫీసర్ల వర్కింగ్‌ సెక్షన్‌, పాస్‌పోర్టు పాలసీ, మీటింగ్‌ హాల్‌, పాస్‌పోర్టు ఆఫీసర్‌ చాంబర్‌, లైబ్రరీ, ఇతర వెయిటింగ్‌ హాళ్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

Updated Date - Apr 08 , 2025 | 01:09 AM