పూటీ లాగుడు పోటీలు ప్రారంభం
ABN, Publish Date - Jan 14 , 2025 | 01:01 AM
ఘంటసాల జడ్పీ హైస్కూల్ క్రీడా ప్రాంగణంలో రెండు రోజులపాటు నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి ఒంగోలు జాతి వృషభరాజముల పూటీ లాగుడు బల ప్రదర్శన పోటీలను ఏపీఎ్‌సఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు ప్రారంభించారు.
ఘంటసాల, జనవరి 13(ఆంధ్రజ్యోతి): సం క్రాంతి సంబరాల్లో భాగంగా డాక్టర్ గొర్రెపాటి నవనీతకృష్ణ మెమోరియల్ ఆధ్వర్యంలో ఘంటసాల జడ్పీ హైస్కూల్ క్రీడా ప్రాంగణంలో రెండు రోజులపాటు నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి ఒంగోలు జాతి వృషభరాజముల పూటీ లాగుడు బల ప్రదర్శన పోటీలను ఏపీఎ్‌సఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు ప్రారంభించారు. సోమ, మంగళవారాల్లో సీనియర్, జూనియర్, న్యూ జూనియర్ విభాగాల్లో పోటీలు నిర్వహిస్తున్నామని నిర్వాహకుడు బండి పరాత్పరరావు తెలిపారు. బరిని ఎన్‌ఆర్‌ఐ రంగనాథ్‌బాబు ప్రారంభించారు. పోటీలను ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు లాంఛనాంగా ప్రారంభించారు. తొలి ప్రదర్శన ఇచ్చిన ఎడ్ల జత రైతు, సర్పంచ్ వెనిగళ్ల రామకృష్ణ ప్రసాద్‌కు కొనకళ్ల మెముంటో అందజేశారు.
Updated Date - Jan 14 , 2025 | 01:01 AM