పట్టుదల, కృషితో ఉన్నత స్థానాలకు చేరండి
ABN, Publish Date - Jan 05 , 2025 | 01:23 AM
పట్టుదల, కృషి ఉంటే రుషులవుతారని, జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకుంటారని, కష్టపడి లక్ష్యాలను సాధించాలని యువతకు మంత్రి కొల్లు రవీంద్ర ఉద్బోధించారు.
‘యువకెరటాలు’లో యువతకు మంత్రి కొల్లు రవీంద్ర పిలుపు
మచిలీపట్నం టౌన్, జనవరి 4 (ఆంధ్రజ్యోతి): పట్టుదల, కృషి ఉంటే రుషులవుతారని, జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకుంటారని, కష్టపడి లక్ష్యాలను సాధించాలని యువతకు మంత్రి కొల్లు రవీంద్ర ఉద్బోధించారు. హిందూ కళాశాల ప్రాంగణంలో శనివారం నిర్వహించిన యువకెరటాలు కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మంత్రి కొల్లు రవీంద్ర, కలెక్టర్ డీకే బాలా జీ, విశ్రాంత న్యాయమూర్తి సత్యనారాయణ పాల్గొన్నారు. వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. మారుమూల ప్రాం తంలో పుట్టి, ప్రభుత్వ పాఠశాలల్లో చదివి ఐఏఎస్ సాధించిన కలెక్టర్ డీకే బాలాజీ అందరికీ ఆదర్శమని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు, జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జి బండి రామకృష్ణ, కొల్లు ఫౌండేషన్ చైర్మన్ కొల్లు నీలిమ పాల్గొన్నారు.
Updated Date - Jan 05 , 2025 | 01:23 AM